- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ ను బాగు చేయటం అనేది ఎవరి వల్ల అవుతుంది ? అని ఆలోచన చేసుకుంటే నిర్మాతలు దర్శకల వల్ల అస్సలు కాదు .. ఎందుకంటే దర్శకులు తమ రెమ్యూనరేషన్ తాము తీసుకుంటున్నారు ... నిర్మాతలు ఎక్కడ హీరో డేట్ లు ఇవ్వడో అని వాళ్ళు అడిగినంత సమర్పించుకుంటున్నారు. ఫలితంగా బడ్జెట్ తడిసి మోపెడు అవుతుంది. ఈ క్రమంలోనే నిర్మాతలు తమ సినిమా అమ్ముకునేందుకు డిస్ట్రిబ్యూట‌ర్ల‌ దగ్గర్నుంచి భారీగా అడ్వాన్సులు తీసుకుంటున్నారు. ఇటు డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎగ్జిబిటర్ల దగ్గర నుంచి భారీగా అడ్వాన్సులు తీసుకుంటున్నారు. చివరకు సినిమా ప్లాప్ అయినా హీరోల మొహమాటం కొద్దీ నిర్మాతలు కోట్లాది రూపాయల కలెక్షన్లు వచ్చినట్టు ఫేక్ పోస్టర్లు వదులుతున్నారు. మన హీరోల పరిస్థితి ఎలా ఉంది ? అంటే ఏళ్ల తరబడి ప్లాపులు ఇస్తూపోతున్న కూడా 10 నుంచి 15 కోట్లు అడుగుతున్నారు. ఒకటి రెండు హిట్లు కొడితే మిడిల్ రేంజ్ హీరోలు కూడా 30 కోట్లు 40 కోట్లు అంటున్నారు.


అసలు ఏ హీరో సత్తా ఎంత ఏ దర్శకుడు సత్తా ఎంత ? అనేది ప్రజలకు తెలియాలి అలా తెలియాలంటే ఏ సినిమా ఏ థియేటర్లో ఎంత వసూలు చేసింది ?ఏ సినిమా ఏ నిర్మాతకు ఎంత నష్టం మిగిల్చింది అన్నది ప్రతి ఒక్కరికి తెలియాలి.. నిర్మాతలకు ఎలాగూ ఆబ్లికేషన్.. హీరోల డేట్లు కోసం కలెక్షన్లకు వచ్చిన రాకపోయినా ఫేక్ పోస్టర్లు వదలాలి. మరి డిస్ట్రిబ్యూటర్లకు ఏం అబ్లిగేషన్ ... కలెక్షన్లు బయట పెట్టాలి కదా ... వాళ్లకు నిర్మాతలతో ఆబ్లికేషన్ ఉంటుంది ... మరి ఎగ్జిబిటర్లకు ఏమి అబ్లిగేషన్ ఏ ఆటకు ఆట ఎంత కలెక్షన్ వచ్చిందో థియేటర్ బయట బోర్డు పెడితే దెబ్బకు అంతా సెట్ అయిపోతుంది. ఏ హీరో సత్తా ఎంత ? ఏ సినిమా సత్తా ఎంత అన్నది జనాలకు తెలిసిపోతుంది. నిర్మాతలు ఎగ్జిబిట‌ర్ల‌ను బెదిరించలేరు బయ్యర్లు ఎగ్జిబిటర్లను శాసించలేరు... అందువల్ల ఎగ్జిబిట‌ర్లు ఈ పనికి పూనుకుంటేనే టాలీవుడ్ కాస్త బతికి బట్ట క‌డుతుందన్న చర్చలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: