టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం సినిమాల పరిస్థితి భిన్నంగా ఉంది. ఒక సినిమా హిట్టైతే పది సినిమాలు ఫ్లాప్ అవుతున్న పరిస్థితులు ఉన్నాయి. థియేటర్లకు సంబంధించి ప్రస్తుతం రెంటల్ విధానం అమలవుతుండగా ఈ విధానానికి బదులుగా షేరింగ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్స్ వ్యక్తమవుతున్నాయి. నైజాంతో పాటు గోదావరి జిల్లలలో ప్రధానంగా ఈ డిమాండ్ వినిపిస్తుండటం గమనార్హం.
 
సితార మైత్రీ నిర్మాతలు రెంటల్ సిస్టమ్ అమలులో ఉండే థియేటర్లతో ఒప్పందం కుదుర్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారని సమాచారం అందుతోంది. భవిష్యత్తులో సైతం షేరింగ్ విధానానికి చెక్ పెట్టే దిశగా సితార మైత్రీ అడుగులు వేస్తున్నాయి. ఈ నిర్మాతల దెబ్బ అదుర్స్ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సితార మైత్రీ బ్యానర్ల ప్రణాళిక అదుర్స్ అని చెప్పవచ్చు.
 
ఈ రెండు బ్యానర్లు ఏడాదికి పది నుంచి 12 సినిమాలను నిర్మిస్తున్నాయి. ఈ బ్యానర్ల సినిమాలకు ఇండస్ట్రీలో మినిమం గ్యారంటీ అనే అభిప్రాయం ఉంది. ఈ రెండు బ్యానర్లు రాబోయే రోజుల్లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నరు. ఈ బ్యానర్లు ఇతర భాషల్లో సైతం సత్తా చాటుతుండటం గమనార్హం. ఈ బ్యానర్ల ప్లాన్స్ మాత్రం అదుర్స్ అనేలా ఉన్నాయి.
 
ఈ నెల 18వ తేదీన ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరికే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. పర్సంటేజ్ విధానం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందనే సంచలన చర్చకు తెర లేస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ఇండస్ట్రీ పరిస్థితి ఏమవుతుందనే చర్చ జరుగుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో రాబోయే రోజుల్లో మరిన్ని భారీ బ్లాక్ బస్టర్ హిట్లు చేరాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. రెండు ప్రధాన బ్యానర్లు ఒకటైతే థియేటర్ల ఓనర్లు సైతం తగ్గాల్సిన పరిస్థితి అయితే ఉంటుందనే చెప్పవచ్చు. థియేటర్ల ఓనర్లకు నష్టాలు రావడం అపోహ మాత్రమేననే కామెంట్లు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ భవిష్యత్తు సినిమాల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: