
ఇటివలె ఒక పెళ్లికి హాజరైన ఈ జంట ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ ఫోటోలను చూసిన జయం రవి భార్య ఆర్తి సోషల్ మీడియా వేదికగా ఒక సంచలన పోస్టును అయితే షేర్ చేసింది. మాకు చట్టారీత్యా ఇంకా విడాకులు మంజూరు కాలేదు విడాకులు ఇచ్చేవరకు నేను ఆర్తి రవినే అంటూ తెలిపింది. 18 సంవత్సరాలు నాతో కలిసి ఉన్న వ్యక్తి తనను ఇంట్లో నుంచి గెంటి వేసి.. తన పిల్లలను పట్టించుకోకుండా వారి యొక్క అవసరాలకు కావలసిన డబ్బును కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారంటూ ఆమె ఒక షాకింగ్ పోస్ట్ ని షేర్ చేసింది.
ఈ మాటల పైన తాజాగా సింగర్ కెనీషా రియాక్ట్ అవుతూ ఒక పంచ్ తో సమాధానాన్ని తెలియజేసినట్లు తెలుస్తోంది. ఎవరికి లొంగని ఒక మగాడు.. ఏ మహిళతో అయితే ఆనందంగా ఉంటారో ..ఆ మహిళ దగ్గరే ఉంటారని ఆ మహిళకే మనసు ఇస్తాడు అంటూ రాసుకోస్తూ..అలాగే మౌనంగా ఉంటున్నాను కదా అని లైట్ తీసుకోలేను నా మౌనమే నా బలం అంటూ రాసుకు రావడంతో.. ఆర్తి కే పరోక్షంగా గట్టి కౌంటర్ వేసింది సింగర్ కేనిషా అంటూ పలువురు నెట్టిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు . దీన్నిబట్టి చూస్తే ఆర్తి దగ్గర ప్రశాంత లేదని సింగర్ కెనీషా దగ్గరే జయం రవి ఉన్నారంటూ మరి కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.