
"జై శ్రీ రామ్" అనే నినాదాన్ని ప్రతిధ్వనించే ఈ సాంగ్ మ్యూజిక్ సెన్సేషన్ గా మారి చార్ట్ బస్టర్ గా నిలిచింది. తాజాగా ఈ సాంగ్ యూట్యూబ్ మ్యూజిక్ లో 25+ మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి అన్ని మ్యూజిక్ చార్ట్స్ లో టాప్ ట్రెండింగ్ కొనసాగుతూ బ్లాక్ బస్టర్ హిట్ గా అదరగొడుతోంది. సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు టాప్ ట్రెండింగ్లో కొనసాగుతుంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి డాన్స్ గ్రేస్, ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్, రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన లిరిక్స్, మ్యాసీవ్ సెట్.. ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశాయి. రానున్న రోజుల్లో ఈ సాంగ్ మరింత పెద్ద హిట్ కాబోతోంది.
తన బ్లాక్‌బస్టర్ ఫస్ట్ మూవీ బింబిసారతో చెరగని ముద్ర వేసిన దర్శకుడు వశిష్ట, విశ్వంభర ని అత్యద్భుతంగా చిత్రీకరిస్తున్నారు. దీనిని ఆయన తన అత్యంత ప్రతిష్టాత్మకమైన డ్రీం ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష కృష్ణన్, ఆశికా రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తుండగా, కునాల్ కపూర్ కీలక పాత్ర పోషించారు. మ్యూజికల్ జీనియస్ ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి డీవోపీ చోటా కె నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్ ఎఎస్ ప్రకాష్. ఇక ఈ సినిమాలో చిరుకు జోడీగా త్రిష కృష్ణన్ నటిస్తుండగా.. ఆశికా రంగనాథ్, కునాల్ కపూర్ నటిస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు