అదేదో సామెత ఉంది.  పులిని చూసి నక్క వాత పెట్టుకున్ని ఎన్ని ఇబ్బందులు పడిందో అందరికీ తెలిసిందే . అయితే ఇప్పుడు అదే సామెతని  ఒక స్టార్ హీరోయిన్ కి అప్లికేబుల్ చేస్తున్నారు సినిమా ఇండస్ట్రీలో ఉండే జనాలు.  ఎవరైనా సరే ఏదైనా ఒక మంచి పని చేస్తే సక్సెస్ అయితే ఆ మంచి పని చేయడానికి అందరూ కాచుకుని కూర్చుంటారు. అయితే ప్రతి ఒక్కరు ఆ విషయంలో సక్సెస్ అందుకుంటారా..? అంటే నో అని చెప్పాలి.  కొందరు సక్సెస్ అవ్వచ్చు కొందరు ఫెయిల్యూర్ అవ్వచ్చు.  అయితే ఒక హీరోయిన్ ఏదో చేసి సక్సెస్ అయ్యింది అని మరొక హీరోయిన్ కూడా అలాగే చేయాలి అనుకోవడం నిజంగా మూర్ఖత్వమే .


ప్రజెంట్ అలాంటి ఓ ఐడియాను ఫాలో చేసే పనిలో బిజీగా ఉంది హీరోయిన్ పూజా హెగ్డే అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . పూజ హెగ్డే ఒకప్పుడు స్టార్ హీరోయిన్.  బుట్ట బొమ్మగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఆ తర్వాత మాత్రం ఆమె టైం అసలు బాగోలేదు . బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్  అందుకోవడమే కాదు . పర్సనల్ కెరియర్ పరంగా కూడా దారుణాతి దారుణంగా ట్రోలింగ్ కి గురైంది . రీసెంట్గా నటించిన రెట్రో సినిమా దారుణమైన నెగిటివ్ టాక్ దక్కించుకుంది.



దీంతో అమ్మడు ఖాతాలో ఉన్న రెండు మూడు ఆఫర్లు కూడా వేరే హీరోయిన్ ఖాతాలో పడిపోయాయి . అయితే పూజా హెగ్డే ఇక ఇలా హీరోయిన్ గానే పాత్రలు చేయాలి అంటే వర్కౌట్ అవ్వదు అంటూ సమంత రేంజ్ లోనే ఆమె ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయాలి అంటూ ట్రై చేస్తుందట . సమంత రీసెంట్ గా ప్రొడ్యూసర్ గా మారి "శూభం" సినిమాతో బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.  ఇప్పుడు అదే స్ట్రాటజీని ఫాలో అవుతుంది పూజ హెగ్డే అని.. పూజ హెగ్డే ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి ప్రొడ్యూసర్ గా మారాలి అని ట్రై చేస్తుంది అన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది.



పూజ హెగ్డే ప్రొడ్యూసర్ గా సక్సెస్ అవుతుందా ..? అవ్వదా..?  పక్కన పెడితే పూజ హెగ్డేలో మాత్రం అంత టాలెంట్ లేదు అని .. సమంత ఇండస్ట్రీలో ఉన్న కొద్ది టైంలోనే ఇండస్ట్రీ అంటే ఏంటో అర్థం చేసుకొని తన లైఫ్ ని పక్కా ప్లాన్ తో ముందుకు తీసుకెళ్తుందని ..పూజా హెగ్డే డైరెక్టర్ - హీరోస్ ని నమ్ముకుంటూ ముందుకు వెళ్లే క్యారెక్టర్ అని .. ఒక ప్రొడ్యూసర్ గా మారాలి అంటే కచ్చితంగా కొన్ని కొన్ని విషయాలలో ఓపిక ఉండాలి అది పూజ హెగ్డే లేదు అంటున్నారు జనాలు . చూద్దాం మరి పూజ హెగ్డే ఏం చేస్తుందో..???

మరింత సమాచారం తెలుసుకోండి: