
స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసుకొని గ్లామర్ సారా సొంతం. మోడలింగ్ వృత్తిలోకి వచ్చిన తొలినాళ్లలో సారా కూడా సినిమా పరిశ్రమలోకి అడుగుపెడుతుందని చాలా మంది భావించారు. కానీ ఆ దిశగా మాత్రం ఆమె అడుగులు పడలేదు. అయితే సారా సినిమాల్లోకి రాకుండా ఆమె తండ్రి సచిన్ అడ్డుపడి ఉంటారని కొందరు అనుమానించారు. అయితే అది నిజం కాదని తాజాగా సారా మాటలతో స్పష్టమైంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో.. అసలు తనకు నటనంటే ఏమాత్రం ఇష్టం లేదని.. పైగా తనకు కెమెరా అంటే చాలా భయమని సారా వెల్లడించింది. ప్రస్తుతం తన పూర్తి దృష్టి నాన్న నడుపుతున్న ఎన్జీవో పైనే ఉందని తెలిపింది. అలాగే బ్యూటీ, లైఫ్ స్టైల్, ఫ్యాషన్ వంటి అంశాలపై కంటెంట్ రూపొందించి సోషల్ మీడియా పోస్ట్ చేయడం తనకెంతో ఆనందాన్ని ఇస్తుందని పేర్కొంది. మనసుకు బాగా దక్కరైన అంశాలపైనే ఫోకస్ పెడతాను తప్ప.. తనకు నచ్చని విషయాలు జోలికి వెళ్ళనని.. అందుకే సినిమాల్లోకి రాలేదని, ఎన్నో అవకాశాలు వచ్చిన రిజెక్ట్ చేశానని సారా చెప్పుకొచ్చింది. ఒకవేళ యాక్టింగ్ ను కెరీర్ గా ఎంచుకుని ఉండుంటే తనకు సంతృప్తి దక్కకపోగా.. ఒత్తిడి, ఆందోలన తనలో పెరిగేవాని సారా టెండూల్కర్ వివరించింది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు