- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలకు డేట్లు కేటాయిస్తూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ రాజకీయాలకు చిన్నపాటి గ్యాప్ ఇచ్చారు. తాజాగా పవన్ హరిహర వీరమల్లు షూటింగ్ ముగించేశారు. ఇప్పుడు ఓజి సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యారు. దీంతో పవన్ అభిమానుల ఆనందం రెట్టింపు అయింది. ఇప్పుడు అందరు దృష్టి ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమా మీద ఉంది. దర్శకుడు హరీష్ శంకర్ తెర‌కెక్కిస్తున్న ఈ సినిమా పక్క కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతుంది. ఇప్పటికే కొంతమేర షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాను పవన్ త్వరలోనే తిరిగి మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాపై దర్శకుడు హరీష్ శంకర్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.


పవన్ కళ్యాణ్ నుంచి ది బెస్ట్ సినిమాను అభిమానులకు అందించేందుకు తమ యూనిట్ ప్రయత్నిస్తుందని .. పవన్ కళ్యాణ్ నుంచి అద్భుతమైన సినిమాను అందించేందుకు తాము మరింత కృషి చేస్తున్నట్టు హరీష్ శంకర్ కామెంట్ చేశారు. పైగా హరీష్ ఇటీవల రవితేజతో తెర‌కెక్కించిన మిస్టర్ బచ్చన్ సినిమా డిజాస్టర్ కావడంతో ఈ సారి చాలా క‌సితో ప‌ని చేస్తున్నాడ‌ట‌. గ‌తంలో హ‌రీష్ - ప‌వ‌న్ కాంబోలో వ‌చ్చిన గ‌బ్బ‌ర్‌సింగ్ మ్యాజిక్ మ‌రోసారి రిపీట్ అవుతుంద‌న్న ధీమా అంద‌రిలోనూ ఉంది. ఎందుకంటే హ‌రీష్ తాజాగా చేసిన కామెంట్లు అలా ఉన్నాయి. హ‌రీష్ గ‌ట్టిగా కొడితే ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ మామూలు హిట్ కాదు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: