యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన సినీ కెరీర్ లో ఎన్నో విభిన్నమైన సినిమాలలో నటించి ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలతో సత్తా చాటారు. నవ్యత ఉన్న పాత్రలకు ఓటు వేసే విషయంలో తారక్ ఎప్పుడూ ముందువరసలో ఉంటారు. దాదా సాహెబ్ ఫాల్కే పాత్రలో తారక్ కనిపించనున్నారని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫాదర్ ఆఫ్ ఇండియన్ బయోపిక్ సినిమాలో తారక్ అనే వార్త ఫ్యాన్స్ కు సైతం సంతోషాన్ని కలిగిస్తోంది.
 
బాలీవుడ్ మీడియాలో ఇందుకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి రాజమౌళి సూచనలు అందించనున్నారని ఈ సినిమాకు సంబంధించి కీలక పాత్ర పోషించనున్నారని సమాచారం అందుతోంది. తారక్ స్క్రిప్ట్ సెలక్షన్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తారక్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతున్నాయి.
 
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ జక్కన్న కాంబినేషన్ రిపీట్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఈ కాంబినేషన్ సినిమాలు సంచలనాలు సృష్టించే అవకాశాలు ఉన్నాయి. జక్కన్న పారితోషికం ప్రస్తుతం 150 నుంచి 200 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. రాజమౌళి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉం్దాలని కెరీర్ పరంగా మరిన్ని విజయాలు అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
 
జూనియర్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కు నితిన్ కక్కర్ దర్శకత్వం వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఒక పోస్టర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుని పాన్ వరల్డ్ స్థాయిలో మరిన్ని సంచలనాలను సృష్టిస్తారేమో చూడాలి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లను అధికారికంగా ప్రకటిస్తారని ఇండస్ట్రీ వర్గాల టాక్. జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ విషయంలో కేర్ తీసుకుంటుండగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఈ హీరో బిజీగా ఉన్నారు. తారక్ కు కెరీర్ పరంగా కలిసిరావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.






మరింత సమాచారం తెలుసుకోండి: