
కాగా ఉప్పెన సినిమా హిట్ అయిన తర్వాత బుచ్చిబాబు ఓ కథను రాసుకున్నాడు . ఆ కథను చాలామంది హీరోలకి వివరించారు . కొంతమందికి కాల్ షీట్స్ లేక రిజెక్ట్ చేస్తే.. మరి కొంత మంది కథ నచ్చక ఆ కథలో మార్పులు చేర్పులు చేయాలి అంటూ సూచించారు. కానీ తాను రాసుకున్న కథను చేంజ్ చేయడం ఇష్టం లేని బుచ్చిబాబు అలానే ఉండిపోయాడు . ఫైనల్లి ఆ కథను ఎవరైతే ఓకే చేస్తారో వాళ్ళతోనే సినిమా తీయాలి అనుకున్నాడు . అనుకున్న విధంగానే రామ్ చరణ్ కి కధ వినిపించాడు . ఆయన ఓకే చేశాడు. ప్రెసెంట్ ఈ సినిమా సెట్స్ పై ఉంది . ఈ సినిమాకి పెద్ది అంటూ టైటిల్ పెట్టారు.
ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది . అయితే ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు ఏ హీరో తో సినిమా తెరకెక్కిస్తున్నాడు అనేది బిగ్ క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోయింది. రామ్ చరణ్ లాంటి బిగ్ హీరోతో సినిమా తెరకెక్కించిన తర్వాత కచ్చితంగా ఆ రేంజ్ హీరోని ఎక్స్పెక్ట్ చేస్తారు అభిమానులు. అందులో తప్పులేదు. అయితే బుచ్చిబాబు కూడా అందుకు తగ్గ రేంజ్ లోనే పక్క ప్రణాళికతో ముందుకు వెళ్ళాడు . అసలు కలలో కూడా ఊహించిన స్టార్ హీరోతో సినిమా ఛాన్స్ కొట్టేసాడు. ఆయన మరెవరో కాదు మహేష్ బాబు .
ప్రెసెంట్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కంప్లీట్ అవ్వాలంటే ఖచ్చితంగా మూడేళ్లు పైనే పడుతుంది. అందుకు కూడా బుచ్చిబాబు ఓకే చెప్పారట. మహేష్ బాబు తో సినిమా కోసం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నాడు బుచ్చిబాబు . ఆ కారణంగానే సంవత్సరాలు లేట్ అయిన పర్వాలేదు .. మహేష్ బాబు తో సినిమా తెరకెక్కించాలి అంటూ డిసైడ్ అయిపోయారట . రీసెంట్గా మహేష్ బాబు కి కథ కూడా వినిపించారట. సుకుమార్ కూడా ఇందుకు హెల్ప్ చేశారట . ఫైనల్లీ బుచ్చిబాబు అనుకున్న విధంగానే ముందుకు వెళ్తున్నాడు . పరిగెడుతూ పాలు తాగడం కన్నా నిలుచొని నీళ్లు తాగడం మంచిది అన్న సామెతను ఫాలో అవుతున్నాడు. నెమ్మది నెమ్మదిగా బిగ్ స్టార్స్ తో అవకాశాలు కొట్టేస్తున్నాడు. చూడాలి మరి మహేష్ బాబు - బుచ్చిబాబు కాంబోలో సినిమా ఎలా ఉంటుందో..?