రీసెంట్ టైమ్‌లో విడుదలై బాక్సాఫీస్‌ హిట్ గా నిలిచిన చిత్రాల్లో `సింగిల్` ఒకటి. శ్రీ విష్ణు హీరోగా కార్తీక్ రాజు దర్శకత్వంలో వచ్చిన అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. ఈ సినిమాలో కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించగా.. వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్, ప్రభాస్ శ్రీను, ఈటీవీ గణేశ్‌ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రల‌ను పోషించారు. మే 9న విడుదలైన సింగిల్ మూవీ తొలి ఆట నుంచే సూపర్ టాక్ ను సొంతం చేసుకుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీని వినోదాత్మకంగా తీర్చిదిద్ది ప్రేక్షకులను మెప్పించడంలో డైరెక్టర్ కార్తీక్ రాజు సక్సెస్ అయ్యాడని విమర్శకులు ప్రశంసలు కురిపించారు.


టాక్ అనుకూలంగా ఉండడంతో సింగిల్ మూవీ మంచి వసూళ్లను రాబడుతుంది. విడుదలైన వారానికే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టింది. ఈ నేపథ్యంలోనే తాజాగా సింగిల్ సక్సెస్ ఈవెంట్ ను నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్ లో శ్రీవిష్ణు ఓ షాకింగ్ మ్యాటర్ ను రివీల్ చేశాడు. ఇంతకీ విషయం ఏమిటంటే.. సింగిల్ చిత్రానికి ఫస్ట్ ఛాయిస్ శ్రీ విష్ణు కాదు. అంతకన్నా ముందే పలువురు హీరోల వ‌ద్ద‌కు సింగిల్ స్టోరీ వెళ్ళిందట. అయితే ఆయా హీరోలు ఏదో ఒక కారణంతో రిజెక్ట్ చేశారట.


అలా రిజెక్ట్ చేసినవారు ఇద్దరో ముగ్గురో కాదు.. ఏకంగా 15 మంది హీరోలు ఉన్నారట. తాజాగా ఈ విషయాన్ని శ్రీ విష్ణు స్వయంగా బయట పెట్టాడు. మూడేళ్ల క్రితమే కార్తీక్ రాజు సింగిల్ మూవీ స్టోరీని త‌న‌కు చెప్పాడని.. అంతక‌న్నా ముందే ఈ కథను 15 మంది హీరోలు రిజెక్ట్ చేశారని.. వాళ్ళందరికీ థాంక్యూ అంటూ శ్రీ విష్ణు చెప్పుకొచ్చాడు. సింగిల్‌తో హిట్ కొడతామని ముందే ఊహించామని.. ఫైన‌ల్ గా అదే జరిగింద‌ని.. కేవలం నవ్వుకోవడానికి మాత్ర‌మే తీసిన సినిమా ఇది అంటూ శ్రీ విష్ణు వ్యాఖ్యానించాడు. ప్ర‌స్తుతం అత‌ని కామెంట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: