తెలుగు ఇండస్ట్రీలో హీరోలు బిగ్ రిస్క్ లు చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపరు.  ఒకే స్టోరీలను ముందుకు తీసుకెళ్తూ ఉంటారు.  ఈ విషయంలో ఫ్యాన్స్  కూడా కొంచెం డిసప్పాయింట్ అవుతుంటారు . మరి ముఖ్యంగా బడా పాన్ ఇండియా స్టార్స్ ఎప్పుడు కూడా అదే రేంజ్ సినిమాలను చూస్ చేసుకుంటూ ఉండడం కొంతమంది అభిమానులకి అస్సలు నచ్చదు . అయితే కొంతమంది హీరోలు మాత్రం బాగా క్యారెక్టర్ కి క్యారెక్టర్ కి మధ్య వేరియేషన్స్ చూపిస్తూ ఉంటారు.  సినిమాకి సినిమాకి మధ్య డిఫరెంట్ షేడ్శ్ ఉండేలా ప్లాన్ చేస్తూ ఉంటారు .


ఆ లిస్టులో జూనియర్ ఎన్టీఆర్ టాప్ ప్లేస్ లో ఉంటారు . జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి రిస్కీ షాట్స్ అయినా చేయడానికి ..ఎలాంటి రిస్కీ కధలను ఓకే చేయడానికి ముందు ఎదురుచూస్తూ ఉంటారు. " జై లవకుశ" సినిమాలో ఆయన ఏకంగా మూడు క్యారెక్టర్ లో కనిపించారు . సాధారణంగా అంత పెద్ద స్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోస్ మూడు క్యారెక్టర్స్ లో కనిపించడానికి అసలు ఒప్పుకోరు . కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం బిగ్ రిస్క్ నే చేశాడు. ఈ సినిమా నందమూరి అభిమానులను బాగా ఆకట్టుకుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ తర్వాత అలా మూడు షేడ్స్ లో కనిపించిన తెలుగు హీరో ఎవరు లేరు .



ఇప్పుడు ఆ ప్లేస్ ని ఆక్యూపై చేయడానికి సిద్ధంగా ఉన్నాడు బన్నీ . పుష్ప2 సినిమాతో తన పేరు మారుమ్రోగిపోయేలా చేసుకున్న అల్లు అర్జున్ .. ప్రెసెంట్ అట్లీ కాంబోలో సినిమాకి ఫిక్స్ అయ్యాడు.  అల్లు అర్జున్ మొత్తంగా ఈ సినిమా లో ట్రిపుల్ షేడ్స్ లో కనిపించబోతున్నారట. అల్లు అర్జున్ లుక్స్ వేరే లెవెల్ లో ఉండబోతున్నాయి అంటూ కూడా తెలుస్తుంది . దీనికోసం అల్లు అర్జున్ సపరేట్ డైటీషియన్ అప్పాయింట్ చేసుకొని డైట్ ఫాలో అవుతున్నారట.  అంతేకాదు అల్లు అర్జున్ లుక్స్ కోసం ప్రత్యేకంగా ఫారిన్ కంట్రీ నుంచి ఒక డిజైనర్ ని పిలిపించారట అట్లీ . బన్నీ సినిమా విషయంలో అట్లీ చాలా సీరియస్ గా ఉన్నాడు . ఎక్కడా కూడా సినిమాకి సంబంధించిన లీక్స్ రాకుండా జాగ్రత్త పడుతున్నారు. కానీ అరాకొరా మాత్రం సినిమాకి సంబంధించిన విషయాలు బయటపడిపోతున్నాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి: