వార్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన వార్2 సినిమా నుంచి ఈరోజు టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ యాక్షన్ సన్నివేశాలు, డైలాగ్స్ ఈ టీజర్ కు హైలెట్ గా నిలిచాయి. ఈ సినిమా కచ్చితంగా 2000 కోట్ల బొమ్మ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఒకింత తెలివిగా ఈ సినిమా డైలాగ్స్ ఉన్నాయని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. ఎన్టీఆర్ సైతం ఈ సినిమాలో రా ఏజెంట్ గా కనిపిస్తున్నారని తెలుస్తోంది.
 
వార్2 సినిమా ట్రైలర్ విడుదలైతే మరిన్ని ప్రశ్నలకు సంబంధించి సమాధానం దొరికే ఛాన్స్ ఉంది. స్పై యూనివర్స్ లో భాగంగా ఈ సినిమా తెరకెక్కినట్టు తెలుస్తోంది. టీజర్ పర్ఫెక్ట్ కట్ అని నెటిజన్లు కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆర్.ఆర్.ఆర్ మూవీలో రామ్ పాత్రను స్పూర్తిగా తీసుకుని ఈ సినిమాలో ఎన్టీఆర్ రోల్ తీర్చిదిద్దారనే కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ సినిమాతో ప్రశంసలు అందుకోవడం పక్కా అని కామెంట్లు వినిపిస్తున్నాయి. క్రిటిక్స్ సైతం ఈ టీజర్ గురించి ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ రోల్ పవర్ ఫుల్ గానే ఉండబోతుందని తెలుస్తోంది. వార్2 సినిమాతో తెలుగు సినిమాల్లో కొత్త అధ్యాయం మొదలైందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వార్2 సినిమాలో ప్రేక్షకులు కోరుకున్న అన్ని సీన్లు ఉండనున్నాయని తెలుస్తోంది.
 
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో తన పర్ఫామెన్స్ తో మెప్పించడం పక్కా అని కామెంట్లు వినిపిస్తున్నాయి. వార్2 సినిమాలో తారక్ కు జోడీగా హీరోయిన్ ఉందో లేదో తెలియాల్సి ఉంది. త్వరలో వార్2 సినిమాకు సంబంధించి మరిన్ని క్రేజీ అప్ డేట్స్ రానున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ రోల్ గురించి వెర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. వార్2 సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలిచే ఛాన్స్ అయితే ఉంది. ఎన్టీఆర్ క్రేజ్, రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: