లోక నాయకుడు కమల్ హాసన్ హీరో గా మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ అనే మూవీ తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శంభు ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఇకపోతే కమల్ హాసన్ , మణిరత్నం కాంబోలో చాలా సంవత్సరాల క్రితం నాయకుడు అనే సినిమా వచ్చింది. ఈ మూవీ ఆ సమయంలో అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. అంత గొప్ప విజయవంతమైన సినిమా తర్వాత కమల్ హాసన్ , మణిరత్నం కాంబోలో రూపొందిన సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో ప్రస్తుతానికి భారీ అంచనాలు ఉన్నాయి.

కొన్ని రోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఆధ్యాతం ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు తారా స్థాయిలో పెరిగిపోయాయి. మరి ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకొని ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇకపోతే ఈ మూవీ కి బుక్ మై షో ఆప్ లో ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఈ సినిమా విడుదలకు ఇంకా చాలా రోజులు మిగిలి ఉండగానే బుక్ మై షో ఆప్ లో ఈ సినిమాకు 50 కే ప్లస్ ఇంట్రెస్ట్ లి లభించాయి.

ఇలా ఈ మూవీ కి బుక్ మై షో ఆప్ లో ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇక ఈ మూవీ కి బుక్ మై షో ఆప్ లో ప్రేక్షకుల నుండి లభిస్తున్న రెస్పాన్స్ ని బట్టి చూస్తేనే అర్థం అవుతుంది ఈ సినిమాపై ప్రేక్షకులు ఏ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు అనేది. మరి ఈ మూవీ తో కమల్ , మణిరత్నం కాంబోకి మరో విజయం దక్కుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: