
టాలీవుడ్ లో నలుగురు పెద్దల గుత్తాధిపత్యం ఎప్పటి నుంచో కొనసాగుతుంది. మరి ముఖ్యంగా నైజాంలో నలుగురు ఇండస్ట్రీ పెద్దలు తెర వెనకాల చేతులు కలిపి ఒక్కటై నైజాం పంపిణీ రంగంలోకి ఎవరిని రాకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఏ నిర్మాత అయిన సినిమా తీస్తే వాళ్ళు చెప్పిన రేటు కే అమ్మాలి. వాళ్ల థియేటర్లలో సినిమాలు వేసుకుంటే వాళ్ళు చెప్పిన అద్దె మాత్రమే తీసుకోవాలి.. ఎంత పెద్ద నిర్మాత అయిన ఎంత పెద్ద హీరో అయినా సినిమా రిలీజ్ అయ్యే టైం కు ఆ నలుగురు కంట్రోల్లోకి వెళ్లి పోవాల్సి వస్తోంది. ఆ నలుగురు ఏం చెప్తే అదే జరుగుతూ వస్తుంది. చాలామంది ఆ నలుగురికి ఎదురు వెళ్లే సాహసం చేయలేకపోతున్నారు. ఎగ్జిబిటర్లు కూడా వాళ్ళు ఇచ్చిన అద్దె తీసుకొని నోటికి తాళం వేసుకుంటున్నారు. అదేమని ఎదురు ప్రశ్నిస్తే వాళ్ళ థియేటర్ కు తర్వాత సినిమా లేకుండా చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో నైజం పంపిణీరంగంలోకి ఎప్పుడు అయితే మైత్రి మూవీస్ ఎంటర్ అయ్యి సక్సెస్ఫుల్గా దూసుకుపోతుందో అప్పటినుంచి ఆ నలుగురు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అయింది.
తాజాగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాను సైతం తాము చెప్పిన రేటుకి తమకే ఇవ్వాలని ఆ నలుగురిలో కొందరు కుట్ర పన్నారు. ఎలాగైనా థియేటర్లు బందును తెరమీదకు తీసుకువచ్చి పవన్ కళ్యాణ్ సినిమాను రిలీజ్ కాకుండా చూడాలని కుట్ర ప్రయత్నాలకు తెరలేపారు. ముందుగా ఈస్ట్ గోదావరిలో ఈ ఉద్యమం మొదలైంది అని తెర మీదకు తీసుకువచ్చి అక్కడ నుంచి నైజాంకు కూడా పాకేలా చేశారు. కేవలం ఆ నలుగురిలో ఓ ముగ్గురు బడా డిస్టిబ్యూటర్లు ఎలాగైనా నైజాం నుంచి మైత్రి మూవీస్ ని బయటికి పంపాలని రకరకాల కుట్రలకు తెరలేపుతున్నారని ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమాను సైతం అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని టాలీవుడ్ లో ప్రచారం గుప్పుమంటోంది కొందరు. అయితే ఈ విషయాన్ని వారి పేర్లతో సహా ఓపెన్ గానే చెప్పేస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు