- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలు వచ్చిన క్లాసిక్ హిట్ సినిమాలలో ఖలేజా కూడా ఒకటి. ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో అనుకున్న రేంజ్ అంచనాలు అందుకోలేదు. దీనికి చాలా కారణాలే ఉన్నాయి. థియేటర్లలో డిజాస్టర్ అయిన ఈ సినిమా బుల్లితెరపై మాత్రం సూపర్ డూపర్ హిట్ అయింది .ఎన్నిసార్లు బుల్లితెరపై ఈ సినిమా వచ్చినా కూడా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. భారీ టీఆర్పీ రేటింగులు రాబ‌ట్టింది. 15 ఏళ్ల తర్వాత థియేటర్లలో ఈనెల 30 రిలీజ్ అవుతున్న ఈ సినిమా సునామీ క్రియేట్ చేస్తుంది అని చెప్పాలి. ఒక మహేష్ బాబు అభిమానులలో మాత్రమే కాకుండా అంద‌రు హీరోల అభిమానుల లో కూడా ఈ సినిమాకి యునానిమస్ పాజిటివ్ రీచ్ ఉంది. ఇప్పుడు ఇదే ఈ సినిమా కు చాలా ప్లస్ అయింది అని చెప్పాలి. 15 ఏళ్ల తర్వాత వస్తున్నఖ‌లేజా సినిమా బుకింగ్స్ అలా ప్రారంభం అయ్యాయో లేదో మొదటి రోజు నుంచి సాలిడ్ నెంబర్ సెట్ చేసింది.


ఇక రీ రిలీజ్ కి రెండు రోజులు సమయం ఉండగానే అప్పుడే అయిదు కోట్ల గ్రాస్ మార్క్‌ ప్రపంచ వ్యాప్తంగా అందుకుని కొత్త రికార్డు చెక్ చేసినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో రిలీజ్ సినిమాలో ఒక ఖలేజా డే వన్ కి భారీ రికార్డులు సెట్ చేసేలా ఉంది. మహేష్ బాబు సరసన అనుష్క హీరోయిన్ గా నటించగా ... సునీల్ కీలక పాత్రలో నటించారు. ప్రకాష్ రాజ్ విలన్ గా చేయగా మణిశ‌ర్మ‌ ఇచ్చిన పాటలు నేపథ్య గీతం అయితే అప్పట్లో ప్రేక్షకులను ఎలా ? ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక గ‌తేడాది సంక్రాంతికి ఇదే మ‌హేష్ బాబు - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన గుంటూరు కారం సినిమా అంచ‌నాలు అయితే అందుకోలేదు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: