
బాలీవుడ్ తారాలకు ఏమాత్రం తీసిపోని గ్లామర్ తో కుర్రకారును ఉర్రూతలూగించిన రంభ అచ్చ తెలుగు అమ్మాయి. ఆమె అసలు పేరు విజయలక్ష్మి. నటనపై ఉన్న మక్కువతో సినీ గడప తొక్కిన రంభ.. 90వ దశకంలో దక్షిణాదిన అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణి. అలాగే నార్త్ లోనూ గ్లామర్ క్వీన్ గా, డాన్సింగ్ డాల్‌గా ఫేమస్ అయింది. నటన, అందం, డ్యాన్స్ సామర్థ్యంతో ప్రేక్షకుల గుండెల్లో చెరిగిపోని ముద్ర వేసింది.

1994లో రిలీజ్ అయిన హాలో బ్రదర్ బాక్సాఫీస్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాలో మొదట సౌందర్యతో పాటు రంభను హీరోయిన్‌గా ఎంపిక చేశారట డైరెక్టర్ ఈవీవీ గారు. రంభ డేట్స్ కూడా ఇచ్చేసిందట. కానీ షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి కొద్ది రోజుల ముందు రంభకు బదులు రమ్యకృష్ణ హీరోయిన్‌గా కావాలంటూ నాగార్జున పట్టుబట్టారట. దాంతో చేసేదేమి లేక రంభను తప్పించి రమ్యకృష్ణను కథానాయికగా తీసుకున్నారు. అదే సమయంలో డైరెక్టర్ ఈవీవీ గారు రంభ మనసు నొప్పించినందుకు ఆమె చేత హలో బ్రదర్ మూవీలోనే `కన్నె పెట్టారో` సాంగ్ చేయించారట. అయినప్పటికీ రంభ కోపం చల్లారలేదు. ఆ కోపంతోనే హలో బ్రదర్ తర్వాత నాగార్జునకు జోడిగా ఎన్ని సినిమాల్లో ఆఫర్లు వచ్చినా చేయనని రంభ తెగేసి చెప్పేదట.