
టాలీవుడ్ లో ఇప్పుడు ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. థియేటర్ రెంటల్ లేదా పర్సంటేజ్ వ్యవహారం మీద భారీగా చర్చలు నడుస్తున్నాయి. ఇప్పటివరకు సింగల్ స్క్రీన్ థియేటర్లలో రెండు రకాలుగా సినిమాలు రిలీజ్ చేస్తూ వచ్చారు. పెద్ద సినిమాలు అయితే రెంటల్ పద్ధతిలో .. చిన్న సినిమాలు లేదా క్రేజీ లేని సినిమాలు అయితే పర్సంటేజ్ పద్ధతిలో రిలీజ్ చేస్తూ వచ్చారు. అయితే మల్టీప్లెక్స్ లలో మాత్రం ఏ సినిమా అయినా పర్సంటేజ్ ప్రకారమే రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సింగిల్ స్క్రీన్ థియేటర్లో ఓనర్లు అందరూ కలిసి తమకు ప్రతి సినిమాకు పర్సంటేజ్ పద్ధతిలో కావాలని డిమాండ్ తెరమీదకు తెచ్చారు. ఇదిలా ఉంటే రెంటల్ పద్ధతి ఏమిటి ? పర్సంటేజ్ పద్ధతి ఏంటి అనేది చాలామంది అవగాహన లేదు. రెంటల్ పద్ధతి విషయానికి వస్తే సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓనర్ కేవలం వేరే వారి సినిమాకు తన సొంత థియేటర్ను అద్దెకి ఇవ్వాల్సి ఉంటుంది. పెళ్లి జరుపుకునేందుకు ఒక కళ్యాణ మండపాన్ని ఎలా ? అద్దెకు ఇస్తారో అలా థియేటర్ను అద్దెకి ఇవ్వటం జరుగుతుంది. అదే పర్సంటేజ్ పద్ధతి విషయానికి వస్తే సినిమా టిక్కెట్లు అమ్మకం జరిగిన తర్వాత ఎన్ని టిక్కెట్లు అమ్ముడయ్యాయో లెక్కలు తీసి అందులో కొంత పర్సంటేజ్ ఎగ్జిబిటార్‌కు... మరికొంత డిస్ట్రిబ్యూటర్ ద్వారా నిర్మాతకు చేరేలా అగ్రిమెంట్లు రాసుకుంటారు.
ఇప్పటివరకు జరుగుతున్న పద్ధతి ప్రకారం పెద్ద సినిమాలన్నీ రెంటల్ పద్ధతిలోనే పంపిణీ చేస్తున్నారు. ఇలా చేస్తున్నప్పుడు తాము నష్టపోతున్నామని సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓనర్లు వాపోతున్నారు. చిన్న సినిమాలను పర్సంటేజ్ లెక్కలో రిలీజ్ చేస్తున్న అవి తమకు ఇబ్బందిగానే ఉన్నాయని .. అదే పెద్ద సినిమాలను రెంటల్ పద్ధతిలో కాకుండా పర్సెంటేజ్ లెక్కలో రిలీజ్ చేస్తే తాము కూడా కొంత లాభం పొందవచ్చని అలా అయితేనే థియేటర్లు నడుస్తాయని చెబుతున్నారు. ఇలా చేయడం రిస్క్ అని కొందరు పెద్ద నిర్మాతలు భావిస్తున్నారు. నిజానికి రెండు పద్ధతుల్లోనూ కొన్ని లాభాలు ..కొన్ని నష్టాలు ఉన్నాయి. కానీ సింగల్ స్క్రీన్ ధియేటర్ ఓనర్లు ఇకపై పర్సంటేజ్ విధానమే కావాలని పట్టుబడుతున్నారు. ఈ పట్టుదలకు కారణం కొందరు నిర్మాతలపై ఆరోపణలు ఉన్నాయని ప్రచారం ఉంది. ఈ ప్రచారం ఇప్పుడు ఏకంగా పెద్దదై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించే స్థాయికి చేరింది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు