- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఖలేజా సినిమా 15 సంవత్సరాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. 2007 చివరలో మహేష్ బాబు అతిధి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఆ సినిమా సరిగా ఆడలేదు. ఆ తర్వాత మూడున్నర సంవత్సరాల పాటు లాంగ్ గ్యాప్ తీసుకుని మహేష్ .. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఖ‌లేజా సినిమాలో నటించారు. అంత‌కు ముందు వీరి కాంబోలో వ‌చ్చిన అత‌డు కూడా థియేటర్ల లో స‌రిగా ఆడ‌లేదు. కానీ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు సొంతం చేసుకుంది. ఖ‌లేజా కూడా థియేట‌ర్ల లో స‌రిగా ఆడ‌క‌పోయినా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు సొంతం చేసుకుంది. మ‌ళ్లీ ఇన్నేళ్ల త‌ర్వాత ఖ‌లేజా ఇప్పుడు రీ రిలీజ్ అయ్యింది.


ఇక రీ రిలీజ్ ప‌రంగా కూడా ఖ‌లేజా అద‌ర గొడుతూ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దూసుకు పోతోంది. అటు స్ట్రైట్ సినిమా భైర‌వం పోటీ లో ఉన్నా కూడా మహేష్‌ బాబు ` ఖలేజా ` మూవీ మొదటి రోజు ఏకంగా రూ. 8.26 కోట్ల గ్రాస్ ని రాబట్టడం విశేషం. దీంతో ఈ మూవీ రీరిలీజ్‌ సినిమాలకు సంబంధించిన అన్ని రికార్డులను బ్రేక్‌ చేసి స‌రికొత్త రికార్డు త‌న పేరిట లిఖించుకుంది. ఇక గతంలో రూ.6.75 కోట్ల తో పవన్‌ కళ్యాణ్ ` గబ్బర్‌ సింగ్ ` మూవీ టాప్‌లో ఉండేది. ఇప్పుడు ఆ రికార్డును మ‌హేష్ బ్రేక్ చేసేశాడు. ఏదేమైనా ఖ‌లేజా సినిమా ను అప్పుడు ప్లాప్ చేసినందుకు ఎంతో మంది బాధ‌ప‌డేవారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: