
అయితే ఇటీవల ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ తమ బ్రాండ్ ప్రమోట్ చేయమని ప్రభాస్ ను సంప్రదించిందట. కేవలం మూడు రోజుల పాటు తమ కంపెనీ యాడ్ షూటింగ్‌లో పాల్గొంటే రూ. 25 కోట్లు రెమ్యునరేషన్ ఇస్తామని ఆఫర్ చేశారట. నిజంగా అది చాలా పెద్ద మొత్తం. కానీ ప్రభాస్ మాత్రం నిర్మొహమాటంగా నో చెప్పేశాడట. ఇందుకు కారణం లేకపోలేదు. కెరీర్ ఆరంభం నుంచి వాణిజ్య ప్రకటనలు చేయడానికి ప్రభాస్ పెద్దగా ఆసక్తి చూపింది లేదు. అందులోనూ రియల్ ఎస్టేట్ అంటే చాలా ప్రమాదకర వ్యాపారం. అటువంటి వ్యాపారాన్ని ప్రమోట్ చేయడం కరెక్ట్ కాదని భావించి ప్రభాస్ రూ. 25 కోట్ల ఆఫర్‌ను ఎడమ కాలితో తన్నాడు.
ఇక ప్రభాస్ నో చెప్పిన తర్వాత అదే కంపెనీ మహేష్ బాబు దగ్గరకు వెళ్లిందట. ప్రస్తుతం మహేష్ బాబు చాలా బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తున్నాడు. దాంతో తప్పకుండా అతను ఎస్ చెబుతాడని సదరు కంపెనీ భావించింది. కానీ మహేష్ కూడా నో చెప్పి వారికి షాక్ ఇచ్చాడు. ఒకవేళ సదరు రియల్ ఎస్టేట్ కంపెనీ మూతపడినా లేదా ఏమైనా సమస్యలు తలెత్తినా ప్రజల్లో తన ఇమేజ్ దెబ్బతింటుందని మహేష్ బాబు భావించాడు. అందుకే ప్రభాస్ బాటలోనే మహేష్ నడిచాడు. మొత్తంగా ప్రభాస్ మరియు మహేష్ బాబు ఇద్దరూ డబ్బు కంటే నమ్మకం ముఖ్యమని రుజువు చేశారు. దీంతో మీరు నిజంగా గ్రేట్ సామి అంటూ నెటిజన్లు వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.