
మంచు విష్ణు ప్రెస్టేజ్స్ సినిమా కన్నప్ప మూవీ లో పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు .. మోహన్ బాబు కోరిక మేరకు అందులో నటించడాని కి ప్రభాస్ ఓకే చెప్పారని .. ఈ సినిమాల్లో ప్రభాస్ రుద్ర అనే క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు .. సాధారణంగా ఏ సినిమాలో అయినా ప్రత్యేక పాత్రలో నటించిన నటులు , హీరోలు ఎవరైనా ప్రమోషన్స్ కి దూరంగా ఉంటారు .. ఆ సినిమాలో నటించే హీరోలు మాత్రమే ఈ ప్రమోషన్లల పనులు చూసుకుంటారు .. కానీ కన్నప్ప ప్రమోషన్లకు ప్రభాస్ వస్తున్నారని ప్రచారం గట్టిగా నడుస్తుంది .. ఈ సినిమా ట్రైలర్ ను నార్త్ లో విడుదల చేయబోతున్నారు .. ఈవెంట్ కి ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా వస్తాడని అంటున్నాడు మంచు విష్ణు ..
ఒకవేళ ఇది మిస్ అయితే హైదరాబాదులో జరగనున్న ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కైనా ప్రభాస్ వస్తున్నారని వారు చెబుతున్నారు .. మరోసారి మోహన్ బాబు రిక్వెస్ట్ చేస్తే ప్రభాస్ తప్పకుండా వస్తాడు , కానీ ఇక్కడ మ్యాటర్ అది కాదు తన మెయిన్ సినిమా రాజా సాబ్ ప్రచారానికి ముందు ప్రభాస్ ఇలా కన్నప్ప సినిమా కోసం ముందుకు వస్తాడా అనేది అందరిలో కొంత అనుమానంగా మారింది .. అలాగే ఈ సినిమాల్లో ప్రభాస్ తో పాటు మరో స్టార్ అక్షయ్ కుమార్ , మోహన్‌లాల్ , మోహన్ బాబు లాంటి చాలా మంది నటులు కీలక పాత్ర లో నటించారు .. అయితే ప్రభాస్ ప్రమోషన్స్ కి వస్తే సినిమా పై అంచనాలు పెరుగుతాయి ఆ రేంజ్ వేరు .. ప్రభాస్ కన్నప్ప మూవీ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి ..
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు