
ఈ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 5.32 కోట్ల కలెక్షన్లు దక్కగా , రెండవ రోజు 1.84 కోట్లు , మూడవ రోజు 1.04 కోట్లు , నాలుగవ రోజు కేవలం 26 లక్షల కలెక్షన్లు మాత్రమే దక్కాయి. ఇకపోతే నాలుగు రోజుల్లో ఈ మూవీ కి నైజాం ఏరియాలో 5.16 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 56 లక్షలు , ఆంధ్ర ఏరియాలో 2.74 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా నాలుగు రోజుల్లో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 8.46 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. నాలుగు రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలిపి 71 లక్షల కలెక్షన్లు దక్కగా , ఓవర్సీస్ లో 1.21 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు నాలుగు రోజుల్లో 10.38 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే ఇప్పటివరకు రీ రిలీజ్ లో భాగంగా ఏ తెలుగు సినిమా కూడా వసూలు చేయని కలెక్షన్లను ఖలేజా మూవీ వసూలు చేసి అద్భుతమైన రికార్డును సొంతం చేసుకుంది