- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభ‌ర సినిమా విషయంలో మెగా అభిమానులు సైతం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఆరంభంలో ప్రారంభమైన డిసెంబర్ సినిమా ముందస్తుగా చేసిన ప్రకటన ప్రకారం ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాలి. కానీ సంక్రాంతి విడుదల కాలేదు. సమ్మర్లో రిలీజ్ అవుతుందని అన్నారు .. కానీ అలా జరగలేదు. సినిమా ఆలస్యానికి కారణం విఎఫ్ఎక్స్ వర్క్ అంటున్నారు. షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని కూడా సమాచారం. అయితే ఈ సినిమా విఎఫ్ఎక్స్ వర్క్ చేయటానికి ఇండియన్ టీం సామ‌ర్థ్యం సరిపోవటం లేదని.. విదేశాల్లో ఉన్న స్టూడియోలతో ఈ సినిమా కోసం పని చేస్తున్నారని అంటున్నారు. ద‌ర్శ‌కుడు వశిష్ట వెంటనే చిరంజీవి లాంటి మెగాస్టార్ తో అతిపెద్ద సోషియో ఫాంట‌సీ సినిమాను తెరకెక్కించే అవకాశం దక్కించుకున్నారు. రెండో సినిమాకి ఏకంగా చిరంజీవి లాంటి స్టార్ హీరోని డైరెక్ట్ చేస్తే అవకాశం అంటే మంచి అవకాశం. అయితే సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి వశిష్ట మీద ఒత్తిడి ఓ రేంజ్ లో ఉంది.


ఇక కొద్ది నెలల క్రితం రిలీజ్ చేసిన గ్లింప్స్‌ వీడియోకు గ్రాఫిక్స్ వర్క్ పై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. వశిష్ట వీఎఫ్ ఎక్స్ విషయంలో పెద్దగా అవగాహన లేకపోవడంతో విశ్వంభ‌ర‌ సినిమా ఆలస్యం అవుతుందంటున్నారు. ఇక దర్శకుడి అవగాహనా లేమి కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో చిరంజీవి సైతం పలు సందర్భాలలో అసహనం వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. మరి విశ్వంభ‌ర‌ ఈ అవరోధాలు దాటుకుని ఎప్పుడు థియేటర్లలోకి వస్తాడో ? చూడాల్సి ఉంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: