
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా హరిహర వీరమల్లు సినిమా వాస్తవంగా ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఈ సినిమా రిలీజ్ .. అటు థియేటర్లు బంద్ విషయంలో టాలీవుడ్ లో పెద్ద వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో అయినా సింగల్ స్క్రీన్ థియేటర్లో యాజమాన్యాలు భారీ లాభాలు వస్తాయని ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు మేకర్స్ రిలీజ్ డేట్ వాయిదా వేశారు. దీనిపై పలువరు డిస్ట్రిబ్యూటర్లు .. నిర్మాతలు .. సినీ రంగానికి చెందిన పలువురు కామెంట్ చేస్తున్నారు. తాజాగా తెలంగాణ స్టేట్ తెలుగు చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ శ్రీథర్ కూడా ఈ సినిమా వివాదం పై కామెంట్ చేశారు. బంద్ అనేది ఇద్దరు నిర్మాతలు .. ఇద్దరు దర్శకులు మాత్రమే క్రియేట్ చేశారని అన్నారు.
ఇక తాము హరిహర విరములు సినిమా ఉందని ప్రతి ధియేటర్ ఖాళీ పెట్టుకున్నాం ... ఇప్పుడు సినిమా వాయిదా వేశారు. ఇప్పుడు మేమంతా ఏం కావాలి ? అని వాపోయారు. ఈ ఏడాది అంతా కేవలం మూడు సినిమాలు మాత్రమే హిట్లు అవడంతో తాము థియేటర్లు నిర్వహిస్తున్నామని లేకపోతే ఈపాటికి గోదాములు ... ఫంక్షన్ హాల్స్ గా మారిపోయావని వాపోయారు. ఈ ఏడాదిలో సంక్రాంతికి వస్తున్నాం , మ్యాడ్ స్క్వేర్ , కోర్ట్ సినిమాలు మూడు మాత్రమే హిట్లుగా నిలిచాయని చెప్పారు. చివరకు నాని హిట్ 3 సినిమా పేరు కూడా ఆయన చెప్పలేదు. ఏది ఏమైనా దీనిని బట్టి టాలీవుడ్ నిర్మాతలు తాము హిట్లు సినిమాలు తీస్తున్నామని ఎంత డొల్ల మాటలు చెబుతున్నారో అర్థం అవుతుంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు