తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి ఎన్నికైన 24 గంటల్లోనే సునీల్ నారంగ్ ఆ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఈయన రాజీనామా గురించి ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంటుంది. ఇలాంటి తరుణంలో సునీల్ నారంగ్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ ఓ గుణపాఠం అంటున్నారు. ఎందుకంటే ఏదైనా గ్రూప్ కు సంబంధించి అందులో ఉన్నవాళ్లు మాట్లాడితే అదంతా గ్రూప్ లీడర్ కే వస్తుంది. అయితే తాజాగా సునీల్ నారంగ్ పై ఇండస్ట్రీలో ఓ మచ్చ మిగిలిపోయింది. అదేంటంటే.. రీసెంట్ గా తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఓ ప్రెస్ మీట్ పెట్టింది. ప్రెస్ మీట్ అంటేనే ప్రజల్లోకి వాళ్ళు మాట్లాడిన మాటలు బలంగా వెళ్తాయి. 

అయితే ఇలా ప్రెస్ మీట్ పెట్టిన సమయంలో టీఎఫ్ సిసి చైర్మన్ సెక్రటరీ శ్రీధర్ మాట్లాడిన మాటలు మాత్రం వివాదాస్పదంగా ఉన్నాయి. ఆయన ప్రెస్మీట్లో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తంపై ఉన్న తన కుళ్లుని బయటపెట్టారు. అంతేకాదు ఓ హీరో పేరు ప్రస్తావించకుండా రెండు కోట్ల రెవెన్యూ ఉన్న హీరోకి 13 కోట్లు పెట్టారు. అంతేకాకుండా హరి హర వీరమల్లు సినిమా వస్తుందని థియేటర్లన్నీ ఖాళీ గా పెట్టాం.ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అంటూ ఘాటుగా మాట్లాడారు. ఆరు నెలలు గడిస్తే కేవలం మూడు సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. అంటూ చాలా వివాదాస్పదంగా ఆ ప్రెస్ మీట్ జరిగింది.. అయితే ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడవలసిన సబ్జెక్టు ఒక్కటైతే సెక్రెటరీ శ్రీధర్ మరొకటి మాట్లాడారు.

దీంతో ఇండస్ట్రీ మొత్తం టి ఎఫ్ సి సి మీద గుర్రుగా ఉంది.అంతేకాదు టి ఎఫ్ సి సి అధ్యక్షుడు చెప్పకుండానే సెక్రటరీ ఆ మాటలు మాట్లాడతారా..అని సునీల్ నారంగ్ మీద నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి.. ముఖ్యంగా ఒక జనరల్ బాడీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అందులో ఎవరు మాట్లాడినా కూడా అది అధ్యక్షుడు మీదికే వస్తుంది. అలా సెక్రటరీ మాట్లాడిన మాటలు సునీల్ నారంగ్ మీదే పడ్డాయి. హరిహర వీరమల్లు మూవీ పై మాట్లాడడం అలాగే ఓ హీరో రెవెన్యూ గురించి ఆయనకు పెట్టిన బడ్జెట్ గురించి మాట్లాడడం అనేది అవసరం లేని విషయాలు.కానీ అనవసర విషయాలను ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడి శ్రీధర్ సునీల్ నారంగ్ పరువు తీశారు. అయితే శ్రీధర్ మాట్లాడిన మాటలకి సునీల్ నారంగ్ రాజీనామా చేయడం ఏంటని మీరు అనుకోవచ్చు.కానీ అధ్యక్షుడిగా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు. 

కాబట్టి ఆయన కింద ఉన్న వాళ్ళు ఏం మాట్లాడినా కూడా అధ్యక్షుడు మీదికే వస్తాయి. అందుకే తన అనుమతి లేకుండా,తనని పట్టించుకోకుండా తనతో ఈ విషయాలు ఏవి ప్రస్తావించకుండానే డైరెక్ట్ గా ప్రెస్ మీట్ లో తమ ఇష్టానుసారం మాట్లాడడం సునీల్ నారంగ్ కి ఏ మాత్రం నచ్చలేదు. అందుకే ఆయన తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇక సునీల్ నారంగ్ కి సినిమా ఇండస్ట్రీ మీద చాలా అవగాహన ఉంది. ఆయనకు ఎన్నో వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఈ పదవి ఆయనకు అవసరమే లేదు.కానీ ఒక మంచి గౌరవ స్థాయిలో ఉన్నారు కాబట్టి ఆయన ఈ పదవిని తీసుకున్నారు. కానీ ఆయన్ని పట్టించుకోకుండా ఎవరికి వారే నిర్ణయాలు తీసుకొని ప్రెస్ మీట్ లు పెట్టి మాట్లాడడం మాత్రం ఆయన సహించలేకపోయారు. అందుకే TFCC అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.ఇక ఈయన రాజీనామా చాలామందికి ఒక గుణపాఠంగా చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: