మామూలుగా ఎవ‌రికి అయినా ఏజ్ పెరుగుతుంటే అందరికీ నీరసం వస్తుంది.. కానీ నందమూరి బాలకృష్ణకు మరింత ఊపు పెరుగుతోంది. అందులోనూ ఆరున్నర ప‌దుల వ‌య‌స్సులో బాల‌య్య వ‌రుస హిట్ల‌తో దూసుకు పోతున్నాడు. అటు రాజ‌కీయంగా కూడా హిందూపురంలో వ‌రుస‌గా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక బాల‌య్య ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో అఖండ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా సీక్వెల్ అఖండ 2 - తాండ‌వం సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.


సినిమా టీజ‌ర్ తాజాగా రిలీజ్ అయ్యి సోష‌ల్ మీడియాను షేక్ చేస్తూ దూసుకు పోతోంది. అఖండ 2 తాండ‌వం ద‌స‌రా కానుకగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా త‌ర్వాత మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వం లో బాల‌య్య సినిమా చేస్తున్నారు. గ‌తంలో వీరి కాంబోలో వ‌చ్చిన వీరసింహా రెడ్డి సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో ఇప్పుడు ఈ కాంబినేష‌న్ సినిమా మీద మంచి క్రేజ్ ఉంది. ఇక ఈ సినిమా త‌ర్వాత కూడా బాల‌య్య నెక్ట్స్ సినిమా ఫిక్స్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రో ? కాదు ... యస్.. హనీఫ్ అదేనీ.


గతేడాది ‘మార్క్’అనే మూవీతో వెండితెరపై రక్తాన్ని ఏరుల్లా పారించిన దర్శకుడు అత‌డు. ఆడియెన్స్ ను అయినా క‌న్వీన్స్ చేసి మంచి మార్కులు తెచ్చుకున్న హ‌నీఫ్ ఇప్పుడు బాల‌య్య‌తో సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. హ‌నీఫ్ రీసెంట్‌గా బాల‌య్య‌తో ‘మ్యాన్షన్ హౌస్’యాడ్ చేశాడు. ఆ సందర్బంగానే ఇద్దరికీ సెట్ అవ్వ‌డంతో అత‌డు చెప్పిన క‌థ బాల‌య్య‌కు న‌చ్చ‌డంతో ఈ ప్రాజెక్ట్ ఓకే అయ్యింద‌ని.. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తార‌ని అంటున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: