ప్రస్తుతం ఈ బ్యూటీ `కుబేర` మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రలు పోషించారు. యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న కుబేర జూన్ 20న తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషలో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. తాజాగా చెన్నైలో ఈ మూవీ ప్రమోషనల్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ లో ధనుష్, నాగార్జున, డైరెక్టర్ శేఖర్ కమ్ములతో పాటు రష్మిక కూడా సందడి చేసింది.
అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను రష్మిక తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అయితే వాటిలో ఓ పిక్ మాత్రం నెటిజన్లను విపరీతంగా అట్రాక్ట్ చేస్తుంది. అసలు ఆ పిక్‌లో ఏముందంటే.. రష్మిక చెయ్యి పట్టుకుని నాగార్జున ఏదో చెబుతూ ఉండగా.. ఎటువంటి గర్వం లేకుండా ఆయన కాళ్ల వద్ద కూర్చుని శ్రద్ధగా వింటూ కనిపించింది. ఎంత పెద్ద స్టార్ అయిన, నేషనల్ లెవల్లో భారీ క్రేజ్ ఉన్న కూడా సీనియర్స్ కు రెస్పెక్ట్ ఇచ్చే విషయంలో మాత్రం దటీజ్ రష్మిక అనిపించుకుంది. ఆమె సింప్లిసిటీకి ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఫీదా అవుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి