ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీని అంతా కలిసి ఒక చోట చూడనే చూడలేదు అభిమానులు . సాధారణంగా మెగా ఫ్యామిలీ మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి ఫ్యామిలీ పార్టీల పేరిట  గెట్ టు గెదర్ ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు.  అయితే అల్లు అర్జున్ తో  ఇష్యూ వచ్చినప్పటి నుంచి మెగా ఫ్యామిలీ ఎక్కడ కూడా చిన్న సెలబ్రేషన్ కూడా చేసుకున్నిందే లేదు . కాగ త్వరలోనే మెగా ఫ్యామిలీలోకి ఒక కొత్త మెంబర్ రాబోతున్నారు . లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్.  ప్రేమించి పెళ్లి చేసుకున్న వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి రీసెంట్ గానే తమ లైఫ్ లోకి ఒక స్పెషల్ వ్యక్తి రాబోతున్నారు అంటూ గుడ్ న్యూస్ షేర్ చేశారు.

దీంతో సోషల్ మీడియా వేదికగా చాలా మంది ఈ జంట పొగిడేశారు. భార్య భర్తలు అంటే ఇలానే ఉండాలి అంటూ తెగ మాట్లాడేశారు. లావణ్య్ త్రుపాఠికి శ్రీమంతానికి అంతా సిద్ధం చేసుకుంటుంది మెగా ఫ్యామిలీ అంటూ కూడా టాక్ వినిపిస్తుంది. మళ్లీ అందరిని కలిసి ఒక్క చోట చూడాలి అంటే కచ్చితంగా లావణ్య త్రిపాఠి శ్రీమంతం జరగాల్సిందే అంటూ మెగా ఫ్యాన్స్ కూడా అనుకున్నారు. అయితే ఇంతకుముందే మెగా ఫ్యామిలీలో ఒక స్పెషల్ ఫంక్షన్ జరగబోతుంది అన్న వార్త బయటకు వచ్చింది .

ఒక స్మాల్ పార్టీని నిహారిక మెగా ఫ్యామిలీ కోసం స్పెషల్ గా ఇవ్వబోతుందట.  ఈ మధ్యకాలంలో నిహారిక జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న విషయం అందరికీ తెలిసిందే . రీసెంట్ గానే ఆమె నిర్మించిన "కమిటీ కుర్రోళ్ళు" సినిమాకి గద్దర్ అవార్డు కూడా వచ్చింది . ఈ క్రమంలోనే నిహారిక అత్త కాబోతున్నాను అనే శుభ సందర్భంగా కూడా ఒక స్పెషల్ పార్టీని అరేంజ్ చేసిందట. ఓ పార్టీని కూడా కండక్ట్ చేయబోతుందట . ఆశ్చర్యమేంటంటే లావణ్య త్రిపాఠి శ్రీమంతం కంటే ముందే ఈ పార్టీలో మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెరవబోతున్నారు. మరి ఈ పార్టీకి అల్లు అర్జున్ ని పిలుస్తుందా..? లేదా..? అనేది బిగ్ క్వశ్చన్ మార్క్.  ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. త్వరలోనే మెగా ఫ్యామిలీ నుంచి ఒక గుడ్ న్యూస్ వినబోతున్నాం అంటూ లావణ్య త్రిపాఠికి పాప పడుతుందా..? బాబు పుడతాడా..? అనేది ఇంట్రెస్టింగ్గా చర్చించుకుంటున్నారు మెగా అభిమానులు . పాప పుట్టిన బాబు పుట్టిన ఒకటే.. కానీ బాబు అయితే ఇంకా హ్యాపీ అంటూ కొంతమంది బోల్డ్ గా కామెంట్స్ చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: