
పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఘాటి జూలై 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. అయితే తాజాగా ఈ సినిమా డిజిటల్ హక్కులను రికార్డు ధరకు ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుందట. అనుష్క మెయిన్ లీడ్ గా యాక్ట్ చేయడం, అలాగే ఇప్పటివరకు వచ్చిన పోస్టర్స్, టీజర్ సినిమాపై మంచి అంచనాలను పెంచడంతో అమెజాన్ వారు ఏకంగా రూ. 36 కోట్లకు ఘాటి ఓటీటీ హక్కులను కొనుగోలు చేశారట.
వాస్తవానికి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంతవరకు ఏ ఉమెన్ సెంట్రిక్ సినిమాకు డిజిటల్ రైట్స్ రూపంలో ఇంత భారీ రేటు రాలేదు. ఈ నేపథ్యంలోనే అనుష్క క్రేజ్ చూసి స్టార్ హీరోలు కూడా షాక్ అవుతున్నారట. కాగా, ఘాటి టోటల్ బడ్జెట్ రూ. 45 కోట్లు. అయితే ఓటీటీ హక్కులే రూ. 36 కోట్లకు అమ్ముడు పోవడంతో బడ్జెట్‌లో పెద్ద మొత్తం రికవరీ అయిపోయింది. దీంతో నిర్మాతలు ఫుల్ ఖుషిగా ఉన్నారట. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 12 కోట్ల రేంజ్ లో జరగొచ్చని అంచనా వేస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు