సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు పట్టిపీడిస్తున్నాయి. ఎప్పుడు ఏ స్టార్ సెలబ్రిటీ మరణ వార్త వినాల్సి వస్తుందో అని సినీ లవర్స్ బిక్కు బిక్కు మని భయపడిపోతున్నారు . సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు బ్యాక్ టు బ్యాక్ వినాల్సిన పరిస్థితి వచ్చింది . ఈ మధ్యకాలంలో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విక్రమ్ సుకుమారన్  మరణించిన విషయం తెలిసిందే. కోలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఆయన మరణంతో డల్ అయిపోయింది.  ఇటీవలే గుండెపోటుతో టలీవుడ్ టాప్ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ కూడా మరణించారు . ఈ బిగ్ స్టార్స్ మరణం నుంచి ఇంకా కోలుకోక  ముందే మరొక సినీ నటుడు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు .


దీంతో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది . సుప్రసిద్ధ సినీ, టీవీ నటుడు అల్లం గోపాల్ రావు కన్నుమూశారు.  ఆయన ఈరోజు ఉదయం 8 గంటలకు తన నివాసంలో తుది శ్వాస విడిచారు. గత  కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు అని కుటుంబ సభ్యులు తెలియజేశారు . దీంతో ఆయన మృతితో తెలుగు సినీ,  టీవీ రంగాలలో విషాదం నెలకొంది . గోపాలరావు చాలా చాలా టాలెంటెడ్ యాక్టర్ .



ఎలాంటి సీన్స్ అయినా సరే అవలీలగా నటించగలడు . మరీ ముఖ్యంగా డైలాగ్స్ చాలా పర్ఫెక్ట్ గా చెప్తాడు అని ఆయనతో వర్క్ చేసిన వారు చెబుతూ ఉంటారు.  గోపాలరావు సినీ టీవీ రంగానికి ఎన్నెన్నో మంచి పనులు కూడా చేసి పెట్టారు . గోపాలరావు పార్థివ దేహాన్ని  ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు . ఆయన ఇండస్ట్రీలో లేని లోటు మరవలేనిది అంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు కొంతమంది స్టార్స్ . ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ మేనేజ్మెంట్ కమిటీ గోపాలరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది.  ఈరోజు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఆయన అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరగనున్నాయి. 75 సంవత్సరాలు ఉన్న గోపాల్ రావుకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు అనిల్ సీరియల్స్ తో పాటు సినిమాల్లో కూడా నటించాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: