
టాలీవుడ్ లో స్టార్ హీరోలు చేస్తున్న పనులతో దర్శకులకు నరకం కనబడుతోంది. మన టాలీవుడ్ టాప్ హీరోలకు ఓ అలవాటు ఉంది. దర్శకులకు అవకాశం ఇస్తామంటూ తమ క్యాంపులో కట్టేసుకుంటారు. అదిగో సినిమా నీకే .. ఇదిగో సినిమా నీకే అని చెప్పి అలా కూర్చోబెడతారు. ఈలోగా హీరోలు సినిమాల మీద సినిమాలు చేస్తూ కోట్లకు కోట్లు సంపాదిస్తూ ఉంటారు. దర్శకులు మాత్రం జీవితాలు .. ఆదాయం కోల్పోతూ ఉంటారు. అయితే మేము మరో సినిమా చేస్తున్నాం కదా రెండేళ్లు పెడుతుంది ... ఈ గ్యాప్ లో ఓ సినిమా చేసుకునే రండి అని చెప్పే మంచి హృదయం చాలామందికి లేదు. ఒకవేళ చెప్పిన పెదవి చివర నుంచి చెప్పి తర్వాత ఆ దర్శకుడికి నరకం చూపిస్తారని గుసగుసలు ఉన్నాయి. ఈ సంగతి తెలుసు కనుక అలా మౌనంగా బాధపడుతూ హీరో క్యాంపులలో మగ్గుతూ ఉంటారు దర్శకులు. దీనికి ఉదాహరణలు చెప్పాలంటే .. ఇలా మగ్గిపోతున్న దర్శకులు జాబితా చాలానే ఉంది.
ఇటీవల భారీ పాన్ ఇండియా సూపర్ డూపర్ హిట్ కొట్టిన హీరో కోసం ఓ దర్శకుడు యేడాదిన్నర కాలంగా ఎదురు చూపులు చూస్తున్నారు. ఇతర హీరోలతో అవకాశాలు వచ్చిన చేయలేదు. ఇప్పుడు ఆ హీరో ఈ దర్శకుడిని కాదని మరో తమిళ దర్శకుడు తో సినిమాకు ఓకే చెప్పేశారు. ఇప్పుడు ఆ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తన బాధను ఎవరికీ చెప్పుకోలేక లోలోన తీవ్రంగా ఆవేదన చెందుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఆ హీరో తమిళ డైరెక్టర్ తో చేసే సినిమా ఎలా లేదన్న మరో రెండేళ్లు పడుతుంది .. అంటే అప్పటివరకు ఈ డైరెక్టర్ ఈ హీరో కోసం ఎదురు చూపులు చూస్తూ ఉండాలి. అంటే మొత్తం మూడేళ్ల పాటు ఖాళీగా ఉండాలి .. ఆ తర్వాత అయినా అవకాశం వస్తుందో రాదో తెలియదు. ఇలా ఈ దర్శకుడి విషయంలో మాత్రమే కాదు చాలామంది దర్శకులు విషయంలోనూ ఇలాంటి వాతావరణమే టాలీవుడ్ లో ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు