సినిమా ఇండస్ట్రీ లో కెరియర్ ప్రారంభంలో దర్శకుడిగా ఉన్న వారు నటులుగా అద్భుతమైన స్థాయికి చేరుకున్న వారు అనేక మంది ఉన్నారు. అలాగే నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత దర్శకులుగా కూడా సక్సెస్ అయిన వారు కూడా ఉన్నారు. ఇక అదే రూట్లోకి మరో టాలీవుడ్ కమెడియన్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. తెలుగు సినీ పరిశ్రమలో కమీడియన్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పరచుకున్న వారిలో రాహుల్ రామకృష్ణ ఒకరు. ఈయన విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన అర్జున్ రెడ్డి మూవీ తో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.

మూవీ తర్వాత నుండి ఈయనకు వరుస పెట్టి తెలుగు సినిమాల్లో అవకాశాలు రావడం జరిగింది. అలాగే ఈయన నటించిన ఎన్నో సినిమాలు మంచి విజయాలు సాధించడంతో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో కమిడియన్ గా అద్భుతమైన గుర్తింపు లభించింది. ఈయన కేవలం సినిమాల్లో కమెడియన్ పాత్రలో మాత్రమే కాకుండా కొన్ని వైవిధ్యమైన పాత్రలో కూడా నటించి నటుడిగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈయన దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

గత కొంత కాలంగా రాహుల్ రామకృష్ణ ఒక కథ పై పని చేస్తున్నట్లు , ఆ కథ తాజాగా కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఇక అదే కథతో ఓ సినిమాకి దర్శకత్వం వహించాలి అని ఆయన అనుకుంటున్నాడు అని , ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులను శరవేగంగా చేస్తున్నట్లు అన్ని కుదిరితే మరికొన్ని రోజుల్లోనే రాహుల్ రామకృష్ణ దర్శకత్వంలో ఓ మూవీ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. రాహుల్ రామకృష్ణ దర్శకత్వం వహించబోయే సినిమా ఏ జోనర్లో ఉండబోతుంది. అందులో ఎవరు నటించబోతున్నారు. ఇలాంటి వివరాలు అన్నీ కూడా మరికొన్ని రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rr