తమిళ సినీ పరి శ్ర మ లో స్టార్ డైరెక్టర్ల లో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో అట్లీ ఒకరు . ఈయన ఇప్పటివరకు దర్శకత్వం వహించిన ప్రతి సినిమా తో కూడా మంచి విజయాన్ని అందుకొని ఇండియా వ్యాప్తంగా దర్శకుడి గా మం చి గుర్తింపును సంపాదించుకున్నా.డు . ఇకపోతే ఈయన కెరియ ర్లో దర్శకత్వం వహించిన సినిమాలలో ఎక్కువగా శాతం సినిమాలు మాస్ కమర్షియల్ అంశాలతో రూపొందినవే.

ఇకపోతే అట్లీ దర్శకత్వంలో రూపొందిన చాలా సినిమాలు కూడా ఏదో ఒక సినిమాను పోలి ఉంటాయి అని , అలాగే ఆయన రూపొందించిన సినిమా కథలు ఏదో సినిమా నుండి కాపీ చేసినట్లు ఉంటాయి అని , అలాగే అతని సినిమాలలోని పాత్రలు కూడా ఏదో ఒక సినిమాలో నుండి కాపీ కొట్టినట్టు ఉంటాయి అని విమర్శలు పలుమార్లు వచ్చాయి. ఇకపోతే తాజాగా అట్లీ వీటిపై చాలా గట్టిగా స్పందించాడు. తను సినిమాలను మరియు తన సినిమాలలోని పాత్రలను కాపీ కొడతాను అని కొంత మంది విమర్శిస్తున్నారు. అది అసలు కరెక్ట్ కాదు. ఎందుకు అంటే నేను సినిమా కథలను , పాత్రలను అస్సలు కాపీ కొట్టను.

కేవలం వాటిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని గొప్ప కథలను , గొప్ప పాత్రలను తీర్చిదిద్దుతూ ఉంటాను అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే అట్లీ కొంత కాలం క్రితం జవాన్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. షారుక్ ఖాన్ ఈ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం అట్లీ , అల్లు అర్జున్ హీరోగా ఓ మూవీ ని రూపొందిస్తున్నాడు. ఈ మూవీ లో దీపికా పదుకొనే హీరోయిన్గా కనిపించబోతుంది. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: