
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమా ఈ నెల 12న రిలీజ్ కావాల్సి ఉన్నా మరోసారి వాయిదా పడింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సారి రిలీజ్ డేట్ మారదు అని పవన్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలతో ఎదురు చూశారు. ఇక జూన్ ఫస్ట్ వీక్ లోగానే ట్రైలర్ వస్తోంది అంటూ టాక్ నడిచినా అది అక్కడితో ఆగి పోయింది. ఇప్పుడు ట్రైలర్ పై క్లారిటీ లేదు .. అసలు సినిమా ఎప్పుడు ? రిలీజ్ అవుతుందో ? ఎవ్వరికి తెలియదు. అసలు మేకర్స్ నుంచి కూడా సరైన క్లారిటీ లేదు. ఇక జూన్ అయిపోతోంది.. జూలై లో కూడా వీరమల్లు సినిమా రిలీజ్ కాకపోతే మరి ఎప్పుడు ? రిలీజ్ అవుతుందో ? ఎవ్వరికి తెలియడం లేదు.
అయితే వీరమల్లు రిలీజ్ డేట్ ప్రకటించ గానే వచ్చిన అటెన్షన్ అంతా ఇప్పుడు పోతోంది. వీరమల్లు తర్వాత రిలీజ్ అయ్యే ఓజి పై ఫ్యాన్స్ అటెన్షన్ మొత్తం వెళ్లిపోయేలా ఉంది. ఈ క్రమంలోనే ‘హరిహర వీరమల్లు ’ పరిస్థితి ఎలా ఉండబోతుందో ఎవ్వరికి అర్థం కావడం లేదు. పవన్ అభిమానులు కూడా ఇప్పుడు ఈ సినిమాకు దేవుడే దిక్కు అనుకుంటోన్న పరిస్థితి. క్రిష్ - ఏఎం. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ సీనియర్ హీరో బాబీ డియోల్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు మరియు నోరా ఫతేహి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు