
నేచురల్ స్టార్ నాని దర్శకుడు .. శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన దసరా సినిమా ఎంత పెద్ద బ్లాక్ పాస్టర్ హిట్ అయిందో చూసాం. ఇప్పుడు వీరిద్దరూ కలిసి మరోసారి చేతులు కలుపుతున్నారు. దసరా లాంటి బ్లాక్బస్టర్ హిట్ తర్వాత వీరి కాంబినేషన్లో ది ప్యారడైజ్ సినిమా మన ముందుకు రాబోతుంది. ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ విషయంలో కాస్త ఆలస్యం జరుగుతూ ఉండడంతో రిలీజ్ డేట్ కూడా వాయిదా పడే అవకాశం ఉందని ఇప్పటివరకు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ సినిమా రిలీజ్ డేట్ ను 2026 మార్చి 26 అంటూ ప్రకటించారు. కానీ ఇప్పుడు టాలీవుడ్ లో చాలా సినిమాలు అదే టైమ్ కు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమా కూడా అప్పుడే రిలీజ్ అవుతుంది. బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో వస్తుంది. రామ్ చరణ్ కు ఎదురెళ్ళి రిస్క్ చేయడం అనవసరం అని భావించిన నాని తోపాటు ఈ సినిమా యూనిట్ ప్యారడైజ్‌ను రిలీజ్ డేట్ వాయిదా వేయాలని భావిస్తుందట. మార్చిలో కాకుండా తమ సినిమాను సమ్మర్ కానుకగా మే 15 తీసుకువచ్చేందుకు మేకర్స్ ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఈ విషయమై వారి త్వరలోనే ఓ క్లారిటీ కూడా ఇస్తారని సమాచారం. ఇక ఈ సినిమాలో ఇప్పటికే రిలీజ్ అయిన నాని లుక్ నెవర్ బిఫోర్ అన్నట్టుగా అందరిలోనూ ఆసక్తి రేపుతున్న సంగతి తెలిసిందే.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు