
అంతేకాకుండా హైదరాబాదుకు వచ్చిన ప్రతిసారి రజనీకాంత్, మోహన్ బాబు ఇంటికి వెళుతూ ఉండేవారట. ఇప్పుడు కన్నప్ప కోసం మోహన్ బాబు, విష్ణు ,రజనీకాంత్ ని కలిశారు. కన్నప్ప సినిమాను మోహన్ బాబు రజనీకాంత్ కి చూపించగా అందుకు సంబంధించి రివ్యూ ని మంచు విష్ణు ఒక పోస్టు రూపంలో తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.. గత రాత్రి రజినీకాంత్ అంకుల్ కన్నప్ప చిత్రాన్ని చూశారు. సినిమా పూర్తి అయిన తర్వాత తనని గట్టిగా హగ్ చేసుకున్నారని..సినిమా తనకు బాగా నచ్చిందని చెప్పారని తెలిపారు.. ఒక యాక్టర్ గా ఈ హగ్గు కోసం 22 ఏళ్లుగా వెయిట్ చేశానంటూ తెలిపారు మంచు విష్ణు.
ఈ విషయం తనకు చాలా ఆనందాన్ని కలిగించిందని రజిని అంకుల్ నన్ను చాలా ఎంకరేజ్ చేసినట్లుగా కనిపించిందని తెలిపారు మంచు విష్ణు. జూన్ 27న విడుదలవుతున్న ఈ సినిమా ఆ శివుని మాయాజాలాన్ని అనుభూతిని చెందేలా చేయడానికి తాను చాలా ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్నాను అంటూ ఒక ఎమోషనల్ గా ట్విట్ రాసుకోచ్చారు. డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మరి ఏ మేరకు సినిమా ఎలా ఉంటుందో చూడాలి అంటే 27వ తేదీ వరకు ఆగాల్సిందే.