సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది హీరోలుగా కెరియర్ను మొదలు పెట్టి ఓ వైపు హీరోలుగా నటిస్తూనే కొన్ని సినిమాల్లో విలన్ పాత్రల్లో కూడా నటిస్తూ ప్రేక్షకులను మెప్పించిన వారు ఉన్నారు. అలాంటి వారు ఎవరో తెలుసుకుందాం.

టాలీవుడ్ యువ నటుడు కార్తికేయ "RX 100" అనే సినిమాతో హీరోగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈయనకు నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. దానితో ఈయన వరుసగా సినిమాల్లో హీరోగా నటిస్తూ వచ్చాడు. మధ్యలో నాని హీరో గా రూపొందిన నానిస్ గ్యాంగ్ లీడర్ అలాగే అజిత్ కుమార్ హీరోగా రూపొందిన వలిమై మూవీలలో కార్తికేయ విలన్ పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. మళ్లీ ఈయన హీరో పాత్రలలో నటిస్తూ వస్తున్నాడు. ఆది పినిశెట్టి కెరియర్ ప్రారంభంలో సినిమాల్లో హీరోగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈయన అల్లు అర్జున్ హీరోగా రూపొందిన సరైనోడు , రామ్ పోతినేని హీరోగా రూపొందిన ది వారియర్ సినిమాల్లో విలన్ పాత్రలలో నటించి ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకున్నాడు. ఆది పినిశెట్టి ఓవైపు సినిమాల్లో హీరో పాత్రలో నటిస్తూనే మరోవైపు విలన్ పాత్రలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో మంచు మనోజ్ ఒకరు. ఈయన కెరియర్ను ప్రారంభించిన దగ్గర నుండి అనేక సంవత్సరాల పాటు హీరోగా కెరియర్ను కొనసాగించాడు. ఇకపోతే కొంత కాలం పాటు ఈయన సినిమాలకు దూరంగా ఉన్నాడు. మళ్ళీ వరుస పెట్టి సినిమాలో నటిస్తున్నాడు. ఈయన కూడా ప్రస్తుతం విలన్ పాత్రలపై అత్యంత ఆసక్తిని చూపిస్తున్నాడు. ప్రస్తుతం మనోజ్ , తేజ సజ్జ హీరోగా రూపొందుతున్న మిరాయ్ మూవీ లో మనోజ్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇలా హీరోగా నటిస్తూనే కొంత మంది నటులు విలన్ పాత్రలలో కూడా నటించడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: