అక్కినేని నాగార్జున ఎంత పెద్ద హీరోనో ఎంత పెద్ద కోటీశ్వరుడు చెప్పనక్కర్లేదు. ఆయన తండ్రి సంపాదించిన ఆస్తిపాస్తులను రెట్టింపు చేసి బిజినెస్ మాన్ గా.. హీరోగా.. హోస్ట్ గా.. ఇలా ఎన్నో బాధ్యతలు తీసుకున్నారు. అయితే అలాంటి నాగార్జున టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో రిచ్చెస్ట్ హీరోలలో ఈయన కూడా ఒకరు. ఈయన ఆస్తి దాదాపు 4,000 కోట్లకు పైగానే అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది.అయితే అలాంటి నాగర్జున 4000 కోట్ల ఆస్తి పెట్టుకొని ఆ స్టార్ హీరో జేబులో డబ్బులు కొట్టేశారా.. ఇది వింటేనే ఆశ్చర్యంగా ఉందే అనుకుంటారు చాలామంది ఈ మ్యాటర్ వింటే. ఎందుకంటే అంత పెద్ద హీరో అయిన నాగార్జునకి డబ్బులు కొట్టేయాల్సిన అవసరం ఏముంది అని చాలామంది అనుకుంటారు. 

ఇక మరికొంత మందేమో సినిమా షూటింగ్ కోసం అలా చేశారని అనుకుంటారు. కానీ సినిమా షూటింగ్ కాదు నాగార్జున రియాల్టీలోనే ఇలా ఓ హీరో జేబులో నుండి డబ్బులు దొంగతనం చేశారు.. ఇక ఆ హీరో మరెవరో కాదు ది గ్రేట్ అక్కినేని నాగేశ్వరరావు..అయితే తండ్రి డబ్బులు కొట్టేయడం తప్పేమీ కాదు. ఎందుకంటే చిన్నప్పుడు ప్రతి ఒక్కరూ చేసిన చిలిపి దొంగతనమే.. మామూలు జనాలే కాదు స్టార్ హీరోలు కూడా చిన్నతనంలో కొన్ని చిలిపి పనులు చేస్తూ ఉంటారు. అలా నాగార్జున తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు జేబులోని పర్సు నుండి డబ్బులు దొంగతనం చేసారట.అయితే ఈ విషయాన్ని తాజాగా హైదరాబాదులో జరిగిన కుబేర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో బయటపెట్టారు.

ఇక ఈ కుబేర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హోస్ట్ గా చేసిన యాంకర్ సుమ నాగార్జున ని కొన్ని ప్రశ్నలు అడిగింది. మీరు ఎప్పుడైనా మీ తండ్రి జేబులో నుండి డబ్బులు కొట్టేసారా అంటే..అవును చిన్నతనంలో నేను నాన్నగారి పర్సులో నుండి డబ్బులు కొట్టేసాను అనే మ్యాటర్ రివీల్ చేశారు. అయితే నేను మా నాన్న పర్సులో నుండి దొంగతనం చేశాను కానీ నా కొడుకులిద్దరూ నా పర్సులో నుండి ఎప్పుడు దొంగతనం చేయలేదని చెప్పారు.ఎందుకలా అని అంటే..ఎందుకంటే నేను వ్యాలెట్ మెయింటైన్ చేయను కాబట్టి అంటూ ఫన్నీ ఆన్సర్ ఇచ్చారు నాగార్జున.

మరింత సమాచారం తెలుసుకోండి: