
పక్కా సమాచారంతోనే అధికారులు ఐటి రైడ్స్ చేసినట్లు తెలుస్తుంది . సరైన పన్ను చెల్లించలేదు అని.. గత కొన్ని నెలలుగా ఆరోపణలు ఆర్య పై ఉన్నాయి . ఈ నేపథ్యంలోనే ఏకకాలంలో ఆయనకు సంబంధించిన వివిధ బిజినెస్ లపై కూడా ఐటి రైడ్స్ నిర్వహించినట్లు తెలుస్తుంది. అంతేకాదు ఆర్య ఒక నటుడిగా మాత్రమే అందరికీ తెలుసు . కానీ ఆయన ఓ మంచి వ్యాపారవేత్త అంటూ కూడా బ్యాక్ గ్రౌండ్ లో టాక్. మంచి వ్యాపారవేత్తగా తనకంటూ ఒక స్పెషల్ మార్క్ చూపించాడు . గతంలో సి షెల్ రెస్టారెంట్ చైన్ ప్రారంభించారు .
అంతేకాదు ఆ తర్వాత ఈ రెస్టారెంట్లను కేరళకు చెందిన కుణి మూస అనే వ్యాపారవేత్తకు విక్రయించినట్లు టాక్ వినిపించింది . అంతేకాదు ఈ దాడుల్లో ఆర్య దగ్గర నుంచి ఐటీ శాఖ అధికారులు చాలా బ్లాక్ మనీ కూడా స్వాధీనం చేసుకున్నారు అని ఆయన దగ్గర చాలా బ్లాక్ మనీ ఉండింది అని కూడా కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఆర్య స్పందించారు . సీ షెల్ రెస్టారెంట్లతో తనకు సంబంధం లేదు అని క్లారిటీ ఇచ్చారు. దీనిపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాగా గతంలో హీరో అల్లు అర్జున్ నటించిన వరుడు సినిమాలో విలన్ పాత్రలో నటించి మెప్పించారు ఆర్య . అంతే కాదు బన్నీ - ఆర్య మంచి జాన్ జిగిడి దోస్తులు అంటూ కూడా పిలుస్తారు. ఆర్య పెళ్లికి స్వయంగా అల్లు అర్జున్ వెళ్లి సందడి చేశారు దానికి సంబంధించిన ఫోటోలు కూడా మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!