టాలీవుడ్ లో కమెడియన్స్ అనగానే ఒకప్పుడు బ్రహ్మానందం, సునీల్, బాబు మోహన్, ఆలీ ఇలా ఎంద‌రో ఉండేవారు. కానీ ఇప్పుడు క‌మెడియ‌న్స్ కూడా హీరోలుగా మారి సినిమాలు చేస్తున్నారు. దాంతో హాస్య‌న‌టుల సంఖ్య చాలా లిమిటెడ్‌గా ఉంది. ప్ర‌స్తుతం తెలుగు ఇండ‌స్ట్రీలో వెన్నెల కిషోర్, సత్య వంటి వారు స్టార్ కమెడియన్స్ గా సత్తా చాటుతున్నారు. వీరి త‌ర్వాత అంత‌టి క్రేజ్ ఎవ‌రైనా ఉందా అంటే అది రాజ్ కుమార్ క‌సిరెడ్డికే. ప్రత్యేకమైన కామెడీ శైలితో ప్రేక్షకులను కడుపు నవ్వించడంలో కసిరెడ్డి మహాదిట్ట.


కిరణ్ అపవరం డెబ్యూ ఫిల్మ్ `రాజావారు రాణి గారు` సినిమాతోనే రాజ్ కుమార్ కసిరెడ్డి కూడా కమెడియన్ గా కెరీర్ ప్రారంభించాడు. ఈ చిత్రంలో కసిరెడ్డి కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఆ తర్వాత `అర్జునుడు ఫాల్గుణ`, `బ్లడీ మేరీ`,  `చిత్తం మహారాణి`, `సీతారామం`, `రంగ రంగ వైభవంగా` త‌దిత‌ర‌ చిత్రాల్లో నటించాడు. త‌క్కువ స‌మ‌యంలోనే క‌సిరెడ్డి స్టార్ క‌మెడియ‌న్‌గా నిల‌దొక్కుకున్నాడు. ఈ మధ్యకాలంలో విడుదలైన `ఆయ్` మూవీతో కసిరెడ్డి క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఇతన్ని దృష్టిలో పెట్టుకునే పాత్రలు రాసుకుంటున్న ద‌ర్శ‌కులు కూడా ఉన్నారు.


ఈ నేప‌థ్యంలోనే క‌సిరెడ్డి హీరోల రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేస్తూ దర్శక నిర్మాతలకు షాక్ ఇస్తున్నాడ‌ట‌. ఏదైనా సినిమాకు కాల్షీట్స్ అడిగితే.. రోజుకు రెండున్నర లక్షలు అడుగుతున్నాడ‌ట‌. అంటే 25 రోజులు కాల్షీట్స్ తీసుకేంటే.. రూ.50 లక్షలు క‌సిరెడ్డికి చెల్లించాల్సిందే. అలాగైతేనే సినిమా చేస్తాన‌ని క‌సిరెడ్డి చెబుతున్నాడ‌ని.. అంత మొత్తం ఇవ్వ‌లేక చాలా నిర్మాణ సంస్థ‌లు వెన‌క‌డుగు వేస్తున్నాయ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: