శ్రీదేవి , బోని కపూర్ ల కూతురు అయినటువంటి జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె చాలా కాలం క్రితమే సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె కెరియర్ ప్రారంభంలో వరస పెట్టి హిందీ సినిమాల్లో నటించింది. ఈమెకు సినిమా అవకాశాలు పెద్ద ఎత్తున వచ్చిన కెరియర్ ప్రారంభంలో మంచి విజయాలు దక్కలేదు. కానీ ఈమెకు సినిమా అవకాశాలు మాత్రం దక్కుతూనే వచ్చాయి. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ కొంత కాలం క్రితం తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర పార్ట్ 1 అనే సినిమాతో ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మొట్ట మొదటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

ప్రస్తుతం ఈమె గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది అనే మరో తెలుగు సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇకపోతే జాన్వి కపూర్ , శిఖర్ పహారియాతో  ప్రేమలో ఉన్నట్లు అనేక రోజుల నుండి వార్తలు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే తాజాగా జాన్వి కపూర్ మరియు షికార్ పహారియా ఇద్దరు కలిసి లండన్ వెళ్లారు. సినిమా షూటింగ్స్ కి కాస్త గ్యాప్ ఇచ్చిన జాన్వీ కపూర్ ప్రస్తుతం తన బాయ్ ఫ్రెండ్ అయినటువంటి షికార్ పహారియాతో కలిసి లండన్ లో చిల్ అవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె లండన్ వీధుల్లో తన బాయ్ ఫ్రెండ్ అయినటువంటి షికార్ పహారియాతో చక్కర్లు కొడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇక ఈ వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో జాన్వి కపూర్ అభిమానులు ప్రైవసీ కోసం వారిద్దరూ లండన్ వెళ్లారు. అయినా కూడా వారికి అక్కడ కూడా ప్రశాంతత లేకుండా పోయింది. సెలబ్రిటీలు ఎక్కడ కనబడితే అక్కడ కొంత మంది కెమెరాలతో వారిని చిత్రీకరించి ఆ వీడియోలను వైరల్ చేస్తున్నారు అని జాన్వి కపూర్ అభిమానులు అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Jk