కొన్ని సినిమాలు చూసామా.. ఎంజాయ్ చేసామా.. మర్చిపోయామా.. అన్న విధంగా ఉంటాయి . మరికొన్ని సినిమాలు ఒక్కసారి చూసిన సరే మనసుకు హత్తుకు పోతాయి.  ఆ సినిమాని పదేపదే చూడాల్సిన అవసరం లేదు. ఆ సినిమాలోని కొన్ని సీన్ లు..డైలాగ్స్ మాత్రం విపరీతంగా గుర్తుండిపోతాయి . మరీ ముఖ్యంగా ఇప్పుడు శేఖర్ కమ్ముల  తెరకెక్కించిన కుబేర సినిమా చూసినా కూడా అలాంటి ఫీలింగే కలుగుతుంది.  శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్గా నాగార్జున కీలక పాత్రలు నటించిన సినిమా కుబేర.

సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ రిలీజ్ అయి మంచి పాజిటివ్ టాక్ అందుకుంది . సినిమా కథ - కంటెంట్ నటీనటుల పర్ఫామెన్స్ అంతా కూడా వేరే లెవెల్.  మరీ ముఖ్యంగా ఈ సినిమాలో శేఖర్ కమ్ముల  రాసుకున్న కొన్ని కొన్ని సీన్స్ డైలాగ్స్ ఐతే వేరే లెవెల్ లో ఉన్నాయి  అని చెప్పుకోక తప్పదు. ఇంకా ఇంకా పక్కాగా చెప్పాలి అంటే అమ్మ పాట . ఈ ఒక్క పాట ఒక ఎత్తు..సినిమా మొత్తం మరొక ఎత్తు. కుబేర సినిమా టోటల్గా హిట్ అవ్వడానికి కారణం అమ్మ పాట అని చెప్పడంలో సందేహమే లేదు .

ఒక పాటలో సినిమా మొత్తం చూపించేశారు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. మరీ ముఖ్యంగా ధనుష్ పెట్టిన ఎక్స్ప్రెషన్స్ వేరే లెవెల్ . ప్రతి ఒక్కరికి ఈ పాట బాగా కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించాడు శేఖర్ కమ్ముల.  ఈ ఒక్క పాట తెరకెక్కించిన విధానం శేఖర్ కమ్ములకు ప్రశంసలు దక్కేలా చేస్తుంది. మరీ ముఖ్యంగా పాన్ ఇండీఅ డైరెక్టర్స్ అయిన రాజమౌళి - ప్రశాంత్ నీల్- సుకుమార్ లాంటి డైరెక్టర్లు కూడా శేఖర్ కమ్ముల ముందు వేస్ట్ అని .. ఇంత ఎమోషనల్ గా సీన్స్ వాళ్ళు తెరకెక్కించలేరు  అని జనాలు మాట్లాడుకుంటున్నారు . ఒక్కే ఒక సినిమాతో శేఖర్ కమ్ముల రేంజ్ పూర్తిగా మారిపోయింది అని చెప్పాలి. ఈ సినిమా పై పాజిటివ్ రివ్యూలు ఎక్కువుగా వినిపిస్తున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: