సాధారణంగా తనికెళ్ల భరణి ఏ విషయంలోనూ ఎక్కువగా మాట్లాడు . ఆయన పని ఆయన చేసుకుని పోతుంటాడు.  మరీ ముఖ్యంగా సినిమా స్టార్స్ గురించి ఆయన ఎక్కువగా ఏ విషయాన్ని హైలెట్ చేసి మాట్లాడరు . అది తనికెళ్ల భరణ ని దగ్గరగా గమనించే.. ప్రతి ఒక్కరికి తెలుసు .  ఆయన కెరియర్ లో ఆయన ఒక నటుడిని చాలా చాలా ప్రశంసించాడు . అంతేకాదు ఆయన చూసి మిగతా హీరోలు కూడా ఆ పని చేయాలి అంటూ రిక్వెస్ట్ చేశారు . దానికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. 


టాలీవుడ్ ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి  ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ధనుష్ గురించి చాలా చాలా ఎమోషనల్ గా స్పందించారు . ఎమోషనల్ గా కామెంట్స్ చేశారు . ఆయన మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేస్తున్నాయి . తనికెళ్ల భరణి మాట్లాడుతూ.." ధనుష్ నాకంటే చాలా చిన్నవాడు . అయినా సరే ఆయనకు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది . దానికి కారణం కూడా ఉంది.  ధనుష్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . బాలీవుడ్ లోకి వెళితే ఆయనకు హై రేంజ్ రెమ్యూనరేషన్ ఇచ్చి మరి సినిమాల్లో పెట్టుకుంటారు . సొంత సంపాదన మీద మాత్రమే ఆయన దృష్టి పెట్టకుండా కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయాలని చూస్తున్నాడు ధనుష్ చూసారా అది.. అది నిజమైన హీరోయిజం అంటే."



"నిర్మాతగా రెండు కోట్ల బడ్జెట్లో చాలా చిత్రాలను నిర్మించాడు . అది నిజంగా గ్రేట్ అని చెప్పాలి. దాదాపు అన్ని చిత్రాలకు 10 కోట్ల వరకు బిజినెస్ జరిగాయి.  కొన్ని చిత్రాలకు జాతియ అవార్డులు కూడా వచ్చాయి. ధనుష్ చేస్తున్నది ఎంత మంచి పని అంటే ఆయన ఒక్కడే లాభపడటం కాదు.. కాదు పక్కవాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు. టాలెంట్ ఉన్న దర్శకులు నటులు చాలామంది ఖాళీగా ఉన్నారు. అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వండి . ధనుష్ వాళ్ళకు అవకాశం కల్పిస్తున్నాడు.  ఏదైనా మీ దగ్గర కథ ఉన్నప్పుడు అది కమర్షియల్ ఎలిమెంట్స్ కి వర్కౌట్ కాదు అని అనిపించినప్పుడు .. కొత్త డైరెక్టర్ .. కొత్త నటీనటులతో.. తక్కువ బడ్జెట్లో ఆ చిత్రాన్ని నిర్మించడం చాలా ఉత్తమం దాని ద్వారా కథ జనాల్లోకి వెళ్ళడమే కాదు .. కొత్త వాళ్లకు అవకాశం వస్తుంది .. నలుగురు బాగుపడతారు నలుగురు కడుపునిండా అన్నం తినగలుగుతారు .. ధనుష్ చేస్తున్నది అదే మిగతా హీరోలు కూడా అలా చేస్తే బాగుంటుంది అంటూ ఆయన మనసులోని అభిప్రాయాన్ని బయటపెట్టాడు.  కాగా  రీసెంట్గా ధనుష్ నటించిన కుబేర సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది . మరి ముఖ్యంగా ధనుష్ పర్ఫామెన్స్ కు అందరు ఫిదా అయిపోయారు. ఒకటి కాదు రెండు కాదు వేల సంఖ్యలోనే ఆయన పై  పాజిటివ్ కామెంట్స్  చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: