ఇప్పుడు ఎక్కడ చూసినా సరే "కుబేర" మూవీకి సంబంధించిన సినిమా టాకే వైరల్ గా మారింది. ధనుష్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా నాగార్జున కీలకపాత్రలో తెలుగు స్టార్ట్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన సినిమానే ఈ "కుబేర".  క్లాసిక్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్న శేఖర్ కమ్ముల దగ్గర నుంచి ఇలాంటి ఒక ఫిలిం వస్తుంది  అని ఎక్స్ పెక్ట్ చేయలేకపోయారు జనాలు. అంతలా ఈ సినిమా బాగా  ట్రెండ్ అవుతుంది .


తమిళం - తెలుగు - మలయాళం - హిందీ - కన్నడ భాషలలో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ  సినిమా మొదటి బొమ్మతోనే హిట్ టాక్ అందుకుంది . మరీ ముఖ్యంగా ఈ సినిమాకి లేడీస్ కూడా బాగా కనెక్ట్ అయిపోతున్నారు . కాగా  తమిళనాడులో ఇవాళ ఉదయం 9 గంటలకు కుబేర సినిమా ఫస్ట్ షో ప్రదర్శించారు . కుబేర మూవీ చిత్ర బృందం కూడా ఇక్కడ సందడి చేసింది . చెన్నైలోనే కోయంబేడులోని రోహిణి థియేటర్లో ధనుష్ ఆయన కుమారుడు లింగ దర్శకుడు శేఖర్ కమ్ముల అండ్ టీం  అభిమానులతో కలిసి సినిమాను చూసి ఎంజాయ్ చేశారు .



ఇదే మూమెంట్లో సినిమాలోని ఒక్కొక్క షాట్ ప్లే అవుతున్నప్పుడు ఆడియన్స్ రెస్పాన్స్ వేరే లెవెల్ లో ఉంది. మరీ ముఖ్యంగా అమ్మ పాట వచ్చిన్నప్పుడు అభిమానులు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు.  ఫ్యాన్స్ సంబరాలకి థియేటర్  రచ్చ రంబోలా గా మారిపోయింది . శేఖర్ కమ్ముల - ధనుష్ అభిమానుల సందడికి బాగా ఎమోషనల్ గా ఫీల్ అయిపోయారు.  అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి .

అయితే శేఖర్ కమ్ముల అభిమానులకి ధన్యవాదాలు చెబుతూ వాళ్ళ రివ్యూ తీసుకుంటున్న ఒక వీడియో బాగా వైరల్ గా మారింది. సాధారణంగా ఏ డైరెక్టర్ కూడా ఇలా చేయడు. చేతులు ఊపుతూ వెళ్లిపోతారు.  ఏదో వచ్చాము సినిమా చూశాము వెళ్ళిపోయామని ఉంటారు . కానీ శేఖర్ కమ్ముల మాత్రం చాలా ప్రశాంతంగా అభిమానులతో సినిమా చూసి ఎంజాయ్ చేశారు దీనికి సంబంధించిన వీడియో  సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది కొంతమంది శేఖర్ కమ్ముల గ్రేట్ అంటూ పొగిడేస్తున్నారు. మరి కొందరు తెలుగోడి సంస్కారం అంటే ఇది అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!




మరింత సమాచారం తెలుసుకోండి: