ఇప్పుడు ఎక్కడ చూసినా సరే అందరు "కుబేర" మూవీ టాక్ గురించి మాట్లాడుకుంటున్నారు . మరి ముఖ్యంగా కధ  అందించిన శేఖర్ కమ్ముల .. డైరెక్షన్ చేసిన శేఖర్ కమ్ముల కన్నా కూడా బెగ్గర్  పాత్రలో కనిపించిన ధనుష్ ని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు.  అసలు ధనుష్ లేకపోయుంటే ఈ సినిమాకు పెద్ద క్రేజ్ వచ్చుండేది కాదు అని .. బెగ్గర్ పాత్రలో లీనం అయిపోయి నటించాడు అని .. అంత పెద్ద స్టార్ హీరో బెగ్గర్ పాత్ర చేయడానికి ఎలా ఒప్పుకున్నాడు ..?? అని ఆయనను రేంజ్ లో ప్రశంసించేస్తున్నారు .


మరీ ముఖ్యంగా ఆయన ఈ సినిమాలో నటించిన నటన తీరుని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. " కుబేర " కోసం ప్రతి ఒక్కరు కష్టపడ్డారు .  స్లమ్ ఏరియాల్లో ఎంతో శ్రమించి షూటింగ్ చేసిన మూవీ టీం కన్నా బిచ్చగాడు పాత్ర కోసం ధనుష్ పడిన కష్టమే అందరికీ తెలుస్తుంది.  చిరిగిపోయిన దుస్తులు .. మాసిన జుట్టు గడ్డంతో ..రియల్ గా బిచ్చగాడిలా తయారైపోయాడు అని .. ఇది నిజంగా ధనుష్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని పొగిస్తున్నారు .



అయితే ధనుష్ నటనకు జాతియ అవార్డు రావడం కూడా ఖాయం అంటూ కొంతమంది రివ్యూవర్స్ రివ్యూలు ఇస్తున్నారు . ఇలాంటి మూమెంట్లోనే ధనుష్ లా  ఏ హీరో కూడా బిచ్చగాడు పాత్ర వేయలేదు అని వేయబోరు అంటూ ఫ్యాన్స్ మాట్లాడుతున్న మూమెంట్లో ఆల్రెడీ అలా ఒక తెలుగు హీరో చేసి మంచి మార్కులు దక్కించుకున్నాడు అంటూ తెలుగు జనాలు రిప్లై ఇస్తున్నారు.  అతడు మరెవరో కాదు "అల్లరి నరేష్" . 18 సంవత్సరాల క్రితం వచ్చిన "పెళ్లయింది కానీ".. సినిమాలో ఆయన బెగ్గర్ పాత్రలో కనిపించి మెప్పించాడు . ఇందుకు సంబంధించిన వీడియోను సైతం షేర్ చేస్తున్నారు.  ధనుష్ బాగా చేశాడు అంతకన్నా ముందే అల్లు అల్లరి నరేష్ ఆ పాత్రకు ప్రాణం పోశాడు ..ఇద్దరికీ ఇద్దరు ఎవర్ని తీసి పడేయలే, అంటూ వాళ్ళ నటన తీరుని ప్రశంసించేస్తున్నారు..!!



మరింత సమాచారం తెలుసుకోండి: