- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

లేటెస్ట్ గా టాలీవుడ్ లో భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన పాన్ ఇండియా సినిమా కుబేర. టాలీవుడ్ కింగ్ నాగార్జున - కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కాంబినేషన్లో రష్మిక మందన్న హీరోయిన్గా శేఖర్ కమ్ముల తర్కెక్కించిన ఈ సినిమాకు ఓవర్సీస్ ప్రీమియర్ షో ల నుంచి సాలిడ్ సూపర్ హిట్ రిపోర్టులు మొదలయ్యాయి. మరీ ముఖ్యంగా శేఖర్ క‌మ్ముల‌ దర్శకత్వం ... ధనుష్ నటనకు క్రేజీ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకు ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల నుంచి కూడా అదిరిపోయే ప్రశంసలు వస్తున్నాయి. ఇక ఈ సినిమా చూసిన యంగ్ టాలెంటెడ్ దర్శకుడు కల్కి 2898 ఏడి తో పాన్ ఇండియా సినిమాతో బాక్సాఫీస్ షేక్ చేసిన నాగ్ అశ్విన్ ఇచ్చిన మాస్ రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


తన ఎక్సైట్మెంట్ ఎలా ఉందంటే మాస్టర్ ఫ..గ్ పీస్ అంటూ వైట్ చేయకండి.. జస్ట్ వెళ్లి చూసేయండి అంటూ తన ఇన్‌స్టా లో స్టోరీ గా త‌న‌ గెస్సింగ్ సింగిల్ లైన్ లో చెప్పటం క్రేజీగా మారింది. ఇక శేఖర్ కమ్ములకు నాగ్ అశ్విన్ ప్రియ శిష్యుడు అన్న విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ్ అశ్విన్‌ ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి ... ఆ తర్వాత దర్శకుడుగా మారాడు. ఏది ఏమైనా బాక్స్ ఆఫీస్ దగ్గర కుబేర్ సెన్షేష‌న్ క్రియేట్ చేస్తుంది అని చెప్పాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ : వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: