టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతగా వడ్డే రమేష్ కుమారుడిగా పేరుపొందిన హీరో వడ్డే నవీన్ 1997లో డైరెక్టర్ ముప్పలనేని శివ డైరెక్షన్లో వచ్చిన కోరుకున్న ప్రియుడు సినిమాతో మొదటిసారిగా హీరోగా పరిచయమయ్యారు వడ్డే నవీన్. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో లవర్ బాయ్ గా కూడా పేరు సంపాదించారు. ఆ తర్వాత ఫ్యామిలీ సినిమాలలో నటించి మరింతదగ్గరైన వడ్డే నవీన్ డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సినిమాతో మరో మెట్టు పైకెదిగారు వడ్డే నవీన్.


ఆ వెంటనే మనసిచ్చి చూడు, చాలా బాగుంది, స్నేహితులు , మా బాలాజీ, బాగున్నారా, చెప్పాలని ఉంది తదితర చిత్రాలను నటించారు. సీనియర్ ఎన్టీఆర్ కొడుకు రామకృష్ణ కూతురుతో వివాహం జరిగగా అయితే కొన్ని కారణాల చేత వడ్డే నవీన్ , చాముండేశ్వరి విడిపోవడం జరిగింది. హీరోగా ఫెడ్ అవుట్ అయిన వడ్డే నవీన్ ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎక్కడ ఉన్నారు అనే విషయాలు అభిమానులు  చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.


ప్రస్తుతం వడ్డే నవీన్ తనకు ఉన్న బిజినెస్ లను చూసుకుంటూ బిజీగా ఉన్నారట. గతంలో ఒక పెళ్లి వేడుకలలో వడ్డే నవీన్ కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అందులో చాలా లావుగా మారిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయారు వడ్డే నవీన్. ఈ మధ్యకాలంలో చాలామంది ఫెడ్ అవుట్ అయిన హీరోలు కూడా తిరిగి మళ్లీ పలు చిత్రాల్లో విలన్ గా లేకపోతే సైడ్ క్యారెక్టర్లలో నటిస్తూ రీఎంట్రీ ఇస్తున్నారు. ఇక అభిమానులు కూడా వడ్డే నవీన్ ని అలా ఏదైనా సినిమాతో రీయంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. గతంలో డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ఎటాక్ చిత్రంతో  సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టిన పెద్దగా ఆకట్టుకోలేక పోయారు. దీంతో అప్పటినుంచి సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి తన కుటుంబ బిజినెస్ లను చూసుకుంటున్నారు వడ్డే నవీన్.

మరింత సమాచారం తెలుసుకోండి: