ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారిడిగా పేరు తెచ్చుకున్న వారిలో అబ్బాస్ ఒకరు. ఈయన తన కెరీర్లో తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించాడు. చాలా సంవత్సరాల క్రితం అబ్బాస్ , వినీత్ ప్రధాన పాత్రల్లో టబు హీరోయిన్గా ప్రేమ దేశం అనే సినిమా వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో అబ్బాస్ కి హీరోగా ఈ మూవీ ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమా ద్వారా అబ్బాస్ కి తెలుగు సినీ పరిశ్రమలో కూడా అద్భుతమైన రీతిలో క్రేజ్ వచ్చింది.

ఆ తర్వాత ఈయన తెలుగులో కూడా వరుస పెట్టి సినిమాల్లో నటించాడు. తెలుగులో ఈయనకు హీరో గా నటించిన సినిమాల కంటే కూడా కీలక పాత్రలలో , ముఖ్య పాత్రలలో నటించిన సినిమాల ద్వారానే మంచి గుర్తింపు వచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం ఈయన విక్టరీ వెంకటేష్ హీరోగా సౌందర్య హీరోయిన్గా రూపొందిన రాజా సినిమాలో ముఖ్య పాత్రలో నటించాడు. ఈ మూవీ ద్వారా ఈయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక బాలకృష్ణ హీరోగా రూపొందిన కృష్ణ బాబు సినిమాలో కూడా అబ్బాస్ ముఖ్య పాత్రలో నటించాడు. ఈ మూవీ ద్వారా కూడా ఈయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలతో పాటు ఈయన తెలుగులో ఎన్నో సినిమాల్లో హీరో గా నటించాడు. అలాగే ముఖ్య పాత్రలలో , కీలక పాత్రలలో నటించాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఈయన ఈ మధ్య కాలంలో ఏ తెలుగు సినిమాలో కూడా నటించలేదు.

ఈయనకు నటించిన సినిమాల ద్వారా పెద్ద విజయాలు రాకపోవడంతో ఈయన కెరీర్ గ్రాఫ్ చాలా వరకు పడిపోయింది. దానితో ఈయన తెలుగు సినిమాల్లో నటించడం లేదు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే ఈయన ఈ మధ్య కాలంలో తెలుగులోనే కాదు వేరే ఇతర భాషల్లో కూడా పెద్దగా సినిమాలు చేయలేదు. అలా కొన్ని సంవత్సరాల క్రితం అమ్మాయిల కలల రాకుమారుడుగా కొనసాగిన అబ్బాస్ ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున సినిమాల్లో నటించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: