బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి షారుక్ ఖాన్ కొన్ని సంవత్సరాల క్రితం వరుస పెట్టి అపజయాలను అందుకున్నాడు. దానితో ఈయన కొన్ని సంవత్సరాలు సినిమాకులకు దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత మళ్లీ ఈయన పఠాన్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వెయ్యి కోట్లకు మించిన కలెక్షన్లను వసూలు చేసి షారుక్ ఖాన్ కి అద్భుతమైన విజయాన్ని అందించింది. ఈ మూవీ తర్వాత ఈయన కోలీవుడ్ డైరెక్టర్ అయినటువంటి అట్లీ దర్శకత్వంలో రూపొందిన జవాన్ అనే సినిమాలో హీరోగా నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకొని 1000 కోట్లకు మించిన కలెక్షన్లను రాబట్టింది.

ఆ తర్వాత షారుక్ నటించిన డంకి మూవీ విడుదల అయింది. ఈ మూవీ భారీ కలెక్షన్లను వసూలు చేయలేకపోయినా మంచి విజయాన్ని మాత్రం సొంతం చేసుకుంది. ఇలా వరుసగా ఒకే సంవత్సరం మూడు విజయాలను అందుకున్న షారుక్ వరుస పెట్టి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం లేదు. అందుకు ప్రధాన కారణం మళ్లీ వస్తే అద్భుతమైన సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు రావాలి అనే ఉద్దేశంతో షారుఖ్ కాస్త గ్యాప్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే తాజాగా షారుక్ ఓ టాలీవుడ్ నిర్మాణ సంస్థ లో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ నిర్మాణ సంస్థలలో ఒకటిగా పేరు తెచ్చుకున్న మైత్రి సంస్థలో షారుక్ నెక్స్ట్ మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరి మధ్య సంప్రదింపులు జరిగినట్లు , అందులో భాగంగా మైత్రి సంస్థలో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సౌత్ డైరెక్టర్ అయినటువంటి అట్లీ దర్శకత్వంలో జవాన్ సినిమాలో నటించిన షారుక్ అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు సౌత్ నిర్మాణ సంస్థలో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని షారుఖ్ అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: