
టాలీవుడ్ లో కుర్ర హీరో నితిన్ హీరోగా తెరకెక్కిన సినిమా తమ్ముడు. వకీల్ సాబ్ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన సినిమా తమ్ముడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండున్నర దశాబ్దాల క్రితం నటించిన తమ్ముడు లాంటి సూపర్ హిట్ టైటిల్ తో ఇప్పుడు పవన్ అభిమాని నితిన్ ఈ సినిమాలో నటిస్తున్నారు. అగ్ర నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు భారీ బడ్జెట్‌తో ఈ తమ్ముడు సినిమాను నిర్మించారు. చాలా రోజుల తర్వాత ఒకప్పటి క్రేజీ హీరోయిన్ లయ ఈ సినిమాతో తిరిగి టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.
వాస్తవంగా ఈ సినిమాను ముందుగా నేచురల్ స్టార్ నానితో చేయాలని దర్శకుడు వేణు శ్రీరామ్ భావించారట. నానికి కథ కూడా చెప్పారు. అప్పుడు నానికి ఉన్న ఎక్కువ కమిట్‌మెంట్ల వల్ల వేణును మరో యేడాది పాటు వెయిట్ చేయాలని చెప్పారట. దీంతో వేణు శ్రీరామ్ చివరకు నితిన్‌ను కలిసి కథ చెప్పి ఓకే చేయించారు. ఇక కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నితిన్ తమ్ముడు సూపర్ హిట్ తో ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి. ఇటీవల నితిన్ నటించిన రాబిన్‌హుడ్ సినిమా కూడా ఈ ఏడాది రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. మరి పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ టైటిల్ నితిన్ కు ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు