ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కీలకంగా వినిపిస్తున్న ఇష్యూ ఫోన్ ట్యాపింగ్.. బిఆర్ఎస్ ప్రభుత్వం గత రెండు పర్యాయాలు తెలంగాణలో అధికారంలోకి వచ్చి మూడోసారి కూడా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ప్రముఖ రాజకీయ నాయకుల ఫోన్ లు ట్యాపింగ్ చేసి వాళ్ల రాజకీయ ఎత్తుగడలు ఏంటో తెలుసుకున్నారు.ముఖ్యంగా ప్రతిపక్షాల ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళు ఎన్నికలకు ముందు ఏం చేయబోతున్నారు.. ఎలాంటి పథకాలు తీసుకురాబోతున్నారు.. వాళ్ళ పర్సనల్ విషయాలు ఏంటి ఇలా ప్రతి ఒక్క విషయాన్ని సీక్రెట్ గా తెలుసుకున్నారు. ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో మాజీ ఎస్ఐబి ప్రభాకర్ రావుని ఇప్పటికే సిట్ విచారణ జరిపిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కేవలం రాజకీయ నాయకులే కాకుండా హీరోయిన్ సమంత, రకుల్ ప్రీత్ సింగ్ ల పేర్లు కూడా ప్రముఖంగా వినిపించాయి.

 ఇక ఈ మధ్యకాలంలో కరాటే కళ్యాణి,యాంకర్ అనసూయ,పవిత్ర లోకేష్, హీరోయిన్ హెబ్బా పటేల్ ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.అయితే వీరి కంటే ముందు సమంతా రకుల్ లకి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు అనేక వార్తలు వినిపించాయి. అంతే కాదు సమంత ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్ల ఆ సీక్రెట్ ఫోన్ కాల్స్ బయటపెట్టి సమంత నాగచైతన్య మధ్య విభేదాలు సృష్టించి, ఇద్దరి మధ్య విడాకులకు బిఆర్ఎస్ ప్రభుత్వం కారణమైంది అని,కేటీఆర్ కూడా రకుల్ ప్రీత్ సింగ్ ఫోన్ ట్యాపింగ్ చేయించి ఆమెతో సన్నిహితంగా మెదిలారని, కేటీఆర్ తన ఫోన్ డాటాని ఎక్కడ బయటపెడతాడోనని భయపడి రకుల్ ప్రీత్ సింగ్ కేటీఆర్ తో క్లోజ్ గా మెదులుతోంది అంటూ రేవంత్ రెడ్డి, కొండా సురేఖ, గజ్జల కాంతం లాంటి ఎంతోమంది కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే మాట్లాడిన సంగతి మనకు తెలిసిందే.

కొండా సురేఖ అయితే అక్కినేని ఫ్యామిలీ పై చాలా నీచమైన కామెంట్లు చేసింది. అయితే ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో చాలామందిని సిట్ విచారణ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ సిట్ విచారణలో సమంత, రకుల్ ప్రీత్ సింగ్ లను కూడా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఏమైనా ప్రశ్నలు అడుగుతారా.. వారిని కూడా విచారణ చేస్తారా అని రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మరి ఈ హీరోయిన్లు విచారణకు హాజరవుతారా.. వీరిని విచారణకు పిలుస్తారా.. గత ప్రభుత్వ చేసిన అన్యాయాలను బయటపెడతారా.. అనేది తెలియాల్సి ఉంది.ప్రస్తుతం సమంత రకుల్ లకు సంబంధించిన విషయం మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: